Credit Card: ప్రస్తుతం భారతదేశంలో అమెరికన్ క్రెడిట్ కార్డ్ కల్చర్ చాలా వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు డబ్బులు ఉంటేనే వస్తువులు, సేవలను పొందిన ప్రజలు ప్రస్తుతం ఈఎమ్ఐలకు బాగా అలవాటు పడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఈ అప్పులు చేసే అలవాటు క్రెడిట్ కార్డుల వల్ల వేగంగా పెరిగిపోయింది.
క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి డబ్బు లేకున్నా అవసరాలు తీర్చుకోవటం సౌలభ్యకరమే అయినప్పటికీ.. ఇది పెద్ద తలనొప్పులను కలిగి ఉంటుంది. వీటి నిర్వహణ విషయంలో చిన్న నిర్లక్ష్యం వహించినా పెద్ద ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. సకాలంలో బిల్లులు చెల్లిచకుంటే భారీ పెనాల్టీలు, అధిక వడ్డీలతో పాటు క్రెడిట్ స్కోర్ తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే తిరిగి చెల్లించే సామర్థ్యానికి సరిపోయే మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేయడం ఉత్తమం.

- క్రెడిట్ కార్డ్ కంపెనీకి చెల్లించాల్సిన మెుత్తాన్ని బకాయిపడినట్లయితే నెలాఖరు వరకు వేచిచూడకండి. రెగ్యులర్ రీపేమెంట్స్ బాకీ ఉన్న బ్యాలెన్స్‌ని తగ్గించి తద్వారా వడ్డీని తగ్గించటంలో సహాయపడుతుంది.
- పెద్ద మెుత్తంలో బిల్లు డిఫాల్ట్ కాకుండా ఉండాలంటే కార్డు బిల్లు ప్రకారం మినిమం డ్యూ చెల్లించటం ఉత్తమం. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్ అస్సలు దెబ్బతినదు. అయితే చెల్లించని మెుత్తంపై దాదాపు రూ.4 వరకు వడ్డీ పడుతుంది.
- చాలా మంది ఎక్కువగా క్రెడిట్ కార్డులను ఈఎమ్ఐల రూపంలో వస్తువులు కొనేందుకు వినియోగిస్తుంటారు. ఇది మనపై ఎక్కువ భారాన్ని మోపదు. పైగా జీరో వడ్డీ రేటుతో ఆఫర్లు ఉన్నట్లయితే వడ్డీ భారం లేకుండా నచ్చిన వస్తువులను కార్డుపై సులువుగా కొనుగోలు చేసుకోవచ్చు. ఇది వడ్డీ ఖర్చులను తగ్గిస్తుంది.
- సాధారణంగా క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఎక్కువ ప్రయోజనాలను అందించే కార్డులపై వార్షిక రుసుమును వసూలు చేస్తుంటాయి. అందుకే కార్డును పొందేటప్పుడు మన అవసరాలకు సరిపోయే బేసిక్ కార్డులను ఎంచుకోవటం వల్ల ఉచిత కార్డుల ఎంపిక డబ్బును ఆదా చేస్తుంది.
- చాలా కార్డులు తమ కస్టమర్లకు ఫుడ్, హోటల్ బుక్కింగ్స్, ట్రావెల్, మూవీస్, షాపింగ్, ఎలక్ట్రానిక్ వస్తువులపై ప్రత్యేక తగ్గింపులు వంటి ఆకర్షనీయమైన ప్రయోజనాలను అందిస్తుంటాయి. వీటిని అర్థం చేసుకోవటం ద్వారా మనం కార్డును సరిగా వినియోగించుకుని డబ్బు ఆదా చేసుకోవచ్చు.
- చివరిగా క్రెడిట్ కార్డుల నుంచి డబ్బును ఏటీఎం ద్వారా విత్ డ్రా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే దీనికి నూటికి 2.5 నుంచి 3.5 శాతం వడ్డీ రేటు ఉంటుంది. కాబట్టి అత్యవసరమైనప్పుడు మాత్రమే ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలి. దీనికి తోడు సకాలంలో బిల్లు మెుత్తాన్ని బకాయి లేకుండా ఎక కాలంలో చెల్లించటం వల్ల మంచి క్రెడిట్ స్కోర్ బిల్డ్ అవుతుంది. తద్వారా భవిష్యత్తులో తక్కువ వడ్డీ రేట్లకు అవసరమైన రుణాలను పొందేందుకు వీలు ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సి విషయం ఏమిటంటే క్రెడిట్ కార్డు అనేది లగ్జరీ కాదు ఒక అత్యవసరం అవసరానికి ఉపయోగపడే సౌకర్యం మాత్రమే.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications