MOdi 3.0 Budget: రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. ఈ క్రమంలో ఆర్థిక మంత్రిగా 8వ సారి బడ్జెట్ ప్రసంగానికి ఆమె సిద్ధం అవుతున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇప్పటికే బడ్జెట్ ప్రసంగం రోజు కోసం సంసిద్ధం అవుతున్నాయి. అయితే గత బడ్జెట్ సమయంలో కూడా ప్రభుత్వ కేటాయింపులకు అనుగుణంగా మార్కెట్లు ప్రభావితం అయిన సంగతి తెలిసిందే.
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు ఈ సారి బడ్జెట్ 2025 నుంచి అంచనాలను తక్కువగా ఉంచుతున్నప్పటికీ.. ఈక్విటీ మార్కెట్ సెంటిమెంట్ డౌన్‌బీట్, బలహీనమైన వినియోగం, నిదానమైన ప్రభుత్వ క్యాపెక్స్ నేపథ్యంలో కొత్త బడ్జెట్ వస్తోందని దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడింది. మోదీ సర్కార్ వచ్చాక ఇది రెండవ బడ్జెట్ అయినప్పటికీ.. 3.0లో తొలి ఫుల్ టైమ్ బడ్జెట్ కావటం గమనార్హం. అందుకే దీనిపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కువగా కసరత్తు చేయాల్సి ఉంటుంది.

మొదటి పూర్తి-సంవత్సర బడ్జెట్‌లు నిర్మాణాత్మక/వ్యూహాత్మక విధాన ఉద్దేశాన్ని సూచించడానికి ప్రభుత్వ ప్రయాణానికి సంబంధించిన బ్లూప్రింట్‌ను రూపొందించడానికి ఒక వేదికగా మాత్రమే కాకుండా, వ్యూహాత్మక ఆర్థిక లావాదేవీలను సమతుల్యం చేయటమే. ఈ క్రమంలో ఎన్డీఏ హయాంలో 2015 నుంచి 2019 ఆర్థిక సంవత్సరాలకు మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్లు భారతీయ ఆర్థిక వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపించిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ హయాంలో గత బడ్జెట్లు ఆర్థిక ఏకీకరణ, జీఎస్టీ అమలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని నొక్కి చెప్పటంతో పాటు వృద్ధికి పునాది వేశాయి.
మోదీ హయాంలో ప్రవేశపెట్టిన తర్వాతి బడ్జెట్లు తయారీ రంగం, ఆత్మ-నిర్భర్ భారత్, కార్పొరేట్ పన్ను తగ్గింపులు, గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలపై దృష్టి సారించాయి. దేశీయ సైక్లికల్స్, క్యాపిటల్ గూడ్స్, ప్రైవేట్ బ్యాంకుల్లో బలమైన మార్కెట్ క్యాప్ చూశాం. రీక్యాపిటలైజేషన్ ద్వారా ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు బలంగా పుంజుకున్నాయని బ్రోకరేజ్ మోతీలాల్ ఓస్వాల్ వెల్లడించింది. ఈ క్రమంలో గడచిన దశాబ్ధకాలంగా ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో వినియోగాన్ని పెంచటం వల్ల ఉండే తక్కువ ప్రయోజనం నుంచి సరఫరా వైపు సంస్కరణ వ్యూహాన్ని అందిపుచ్చుకుంది.
మోదీ సర్కార్ దేశంలోని రవాణా వ్యవస్థలను మెరుగుపరచటంపై కూడా భారీగానే ఫోకస్ పెట్టింది. FY14-FY24 మధ్య కాలంలో రోడ్ల నిర్మాణ వ్యయాన్ని 6 రెట్లు పెంచగా.. రైల్వేల కోసం 8 రెట్లు ఎక్కువగా పెట్టుబడులు పెట్టింది. 2019-20లో ప్రకటించిన నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ ద్వారా ఈ ప్రయత్నాలు విస్తరించబడ్డాయి. సిమెంట్, క్యాపిటల్ గూడ్స్ రంగాలు దీనివల్ల అధికంగా లాభపడ్డాయి. దీని స్టాక్ మార్కెట్లలో వివిధ రంగాలతో పాటు అనేక కంపెనీల షేర్లపై పెట్టుబడిదారులు బడ్జెట్ ప్రకటనలతో మంచి లాభాలను అందుకున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications