గ్రేమార్కెట్ అంటే ఏంటి..?? అసలు ఇది ఎలా పనిచేస్తుంది..??
Grey Market: ప్రస్తుతం ఐపీవోలు అధిక సంఖ్యలో మార్కెట్లోకి వస్తున్న వేళ చాలా తరచుగా పెట్టుబడిదారులు వినే పేరు గ్రేమార్కెట్ ప్రీమియం. కొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఇన్వెస్టర్లకు దీని గురించి చాలా మందికి తెలియదు. వివరాల్లోకి వెళితే..
గ్రే మార్కెట్ అనధికారిక, నియంత్రణ లేని మార్కెట్. ఇందులో షేర్లు వాస్తవానికి బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో జాబితా చేయటానికి ముందరే ట్రేడ్ చేయబడతాయి. ఇక్కడ ట్రేడింగ్ ఎలక్ట్రానిక్ రూపంలో జరగదు. గ్రే మార్కెట్‌లో షేర్ ట్రేడింగ్ వ్యక్తిగతంగా జరుగుతుంది. అయితే ఇది చట్టవిరుద్దంగా పరిగణించబడదు.

గ్రే మార్కెట్ ప్రీమియం అనేది స్టాక్ మార్కెట్‌లో షేర్లు జాబితా చేయబడే ముందు గ్రే మార్కెట్‌లో IPO ధర కంటే ఎక్కువ చెల్లించడానికి పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్న అదనపు ధరను సూచిస్తుంది. ఉదాహరణకు ఏదైనా కంపెనీ తన ఐపీవో కోసం ఒక్కో షేరు ఇష్యూ ధర రూ.450గా నిర్ణయించిందని అనుకుందాం. గ్రే మార్కెట్‌లో షేర్ ధర రూ.470 ఉన్నట్లయితే అదనపు రూ.20ని దానిని గ్రేమార్కెట్ ప్రీమియం అని పిలుస్తారు.
ఐపీవోల్లో షేర్ ఇష్యూ ప్రైసింగ్ లాగా, గ్రే మార్కెట్‌లో అధిక ప్రీమియం ధర సాధారణం. IPOలో షేర్ల డిమాండ్, సరఫరా పరిస్థితిని బట్టి గ్రేమార్కెట్లో ప్రీమియం లెక్కించబడుతుంది. అయితే ఐపీవో కోసం దరఖాస్తు చేసే సమయంలో కేవలం GMP ధరను మాత్రమే పరిగణనలోకి తీసుకోకూడదు. GMP ధర 70 నుంచి 80 శాతం ఖచ్చితమైనదని, లిస్టెడ్ ధర కంటే 5 శాతం ఎక్కువ లేదా తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications