Budget 2025: ఈసారి బడ్జెట్ వేటి ధరలు పెరిగాయి..? వేటి ధరలు తగ్గాయి..? తెలుసుకోండి..
Union Budget 2025: ప్రతి ఏటా మాదిరిగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్లో అనేక కీలక అంశాలపై తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో చాలా మంది సాధారణ ప్రజలు సహజంగా చూసేది వేటి ధరలు పెరిగాయి వేటి ధరలు తగ్గాయి అనేది కీలక అంశంగా ఉంటుందని తెలిసిందే.
వాస్తవానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని గమనిస్తే.. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ఎక్కువగా ప్రధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు ఆమె బడ్జెట్లో సమ్మిళిత అభివృద్ధి, పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం, ప్రజల సెంటిమెంట్లను పెంపొందించటంపై దృష్టిని కొనసాగించారు. ఇదే క్రమంలో దేశంలో పెరుగుతున్న మధ్యతరగతి ప్రజలు ఖర్చు చేసేందుకు చేతిలో ఎక్కువ ఆదాయం మిగిలే విధంగా సంస్కరణలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు.

ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా వేటి ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. బడ్జెట్ 2025 ప్రకటనల ప్రకారం మెుబైల్ ఫోన్లు, ప్రాణాలను కాపాడే కొన్ని ముఖ్యమైన మందులు, ఈవీ బ్యాటరీలు, ఘనీభవించిన చేపల పేస్ట్, వెట్ బ్లూ లెథర్, క్యారియర్ గ్రేడ్ ఈథర్నెట్ గ్రిడ్, 12 రకాల కీలక ఖనిజాలు, ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీల ఓపెన్ సెల్స్, షిప్పుల తయారీలో వినియోగించే ముడి సరకులపై 10 ఏళ్ల పాటు బేసిక్ కస్టమ్స్ సుంకం తగ్గింపు, మెరైన్ ఉత్పత్తులు, కోబాల్ట్ ఉత్పత్తులు, ఎల్ఈడీ ఉన్నాయి. ఇదే క్రమంలో లిథియం-అయాన్ బ్యాటరీ, సీసం, జింక్ వంటి 12 కీలకమైన ఖనిజాల స్కాప్ చేర్చబడ్డాయి.
ఇదే క్రమంలో ఏఏ వస్తువుల ధరలు ఖరీదైనవిగా మారుతున్నాయో పరిశీలిస్తే.. ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, దిగుమతి చేసుకున్న అల్లిన బట్టలు వంటివి ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 4 ఏళ్ల కనిష్ట స్థాయి 6.4 శాతానికి పడిపోతుందని అంచనాలు నేపథ్యంలో.. జీడీపీ దశాబ్ద సగటుకు దగ్గరగా ఉంటుందని బడ్జెట్ పేర్కొంది.


Click it and Unblock the Notifications