Budget 2024 Expectations: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల మధ్య బీజేపీ ప్రభుత్వం మధ్యంతర తాత్కాలిక బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల్లో మిత్రపక్షాల సహాయంతో గట్టెక్కిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మోదీ అధ్యక్షతన మూడోసారి రాగా, తొలి వార్షిక బడ్జెట్ ప్రకటించటానికి నేడు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తారనే ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ ఉన్నారు.
దేశ పౌరులందరు భారీ ఆశలు పెట్టుకున్న ప్రస్తుత సమయంలో మోదీ సర్కార్ ప్రకటిస్తున్న బడ్జెట్ ప్రధానంగా రాబోయే సంవత్సరానికి ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రాధాన్యతలకు అర్థం చేసుకోవటానికి సహాయపడనుంది. వేతన జీవుల నుంచి సామాన్య మధ్యతరగతి ప్రజల వరకు అందరూ ప్రధానంగా ఆదాయపు పన్ను రిలీఫ్ కోరుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో కొత్త పన్ను విధానంలోని పన్ను శ్లాబ్లలో మార్పులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. ఇది వాస్తవానికి పన్ను చెల్లింపుదారులకు పెద్ద వరంగా ఉంటుంది.

సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వానికి దీర్ఘకాల ప్రాధాన్యతగా పరిగణించబడుతుంది. దేశంలోని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పై పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థను ప్రేపించటంతో పాటుగా కొత్త ఉపాధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. ఇది దేశంలోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి తోడ్పడేందుకు ప్రభుత్వం రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఇతర కీలకమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంపై దృష్టి సారించింది. ముఖ్యంగా యువతకు మరిన్ని ఉద్యోగాలు కల్పించడానికి మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలకు మద్దతునిచ్చే చర్యలను ప్రభుత్వం ప్రకటించాలని లక్షల మంది యువత కోరుకుంటున్నారు.
దేశానికి వెన్నుముకగా ఉన్న అన్నదాతలకు ప్రస్తుతం పీఎం కిసాన్ స్కీమ్ కింద అందిస్తున్న ప్రస్తుతం అందిస్తున్న రూ.6000 పెంచాలని రైతులు కోరుకుంటున్నారు. వాస్తవానికి ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిన వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులను పరిగణలోకి తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. వ్యవసాయ రంగానికి మద్దతు ఇవ్వడం మొత్తం ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనది, అలాగే ఇది దేశ ఆహార భద్రతకు అతిముఖ్యమైనది కూడా.
దేశంలోని రక్షణ రంగంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రధానంగా అవసరమైన రక్షణ సామాగ్రిని దేశీయంగా సోర్సింగ్ చేయటంతో పాటు విదేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసేలా తగిన ప్రోత్సాహకాలు అందించటం ఆర్థిక వ్యవస్థ వృద్ధితో పాటు కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని చాలా మంది కోరుకుంటున్నారు. ఇది జాతీయ భద్రతను మెరుగుపరచడంతో పాటు భారతదేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.
దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం, వృద్ధిని నిర్ధారించడానికి ఆర్థిక క్రమశిక్షణతో ప్రజాకర్షక చర్యలను సమతుల్యం చేయడం చాలా ముఖ్యమైనదిగా నిపుణులు చెబుతున్నారు. నేడు ఆర్థిక మంత్రి ఉదయం 11 గంటలకు తన ప్రసంగాన్ని మెుదలుపెట్టనున్న వేళ తమ అంచనాలు ఎంత మేర నెరవేరతాయనే ఆశతో నిర్మలా సీతారమన్ ప్రసంగంపై దేశంలోని కోట్ల మంది ప్రజలతో పాటు పరిశ్రమ వర్గాలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు, విదేశీ ఇన్వెస్టర్లతో పాటు మరింతమంది ఆస్తిగా ఉదయం నుంచి చూస్తున్నారు.


Click it and Unblock the Notifications