Stock Market: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొని పాజిటివ్ లోనే కొనసాగాయి. ఈ క్రమంలో కీలక బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు మంచి లాభాలతో తమ ప్రయాణాన్ని ముంగించాయి. ప్రధానంగా రేట్లను పెంచకూడదని రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయం మార్కెట్లలో కొత్త ఉత్సాహానికి కారణమైంది.
ఈ క్రమంలో ఇన్వెస్టర్లు వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉంటాయనే దానిపై దృష్టి సారించారు. వచ్చే వారం కూడా మార్కెట్లు బుల్స్ చేతిలోనే ఉంటాయా.. లేక బేర్స్ చేతిలోకి జారుకుంటాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నిపుణుల అంచనా ప్రకారం రిజర్వు బ్యాంక్ తీసుకున్న రేట్ల నిలిపివేత ప్రభావం పాజిటివ్ గా ఉంటుందని భావిస్తున్నారు. ఇది రానున్న వారాల్లో మార్కెట్ల జోరుకు సాయంగా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ క్రమంలో వచ్చే వారం ఐటీ కంపెనీల వార్షిక, త్రైమాసిక ఫలితాలు మార్కెట్లకు చాలా కీలకంగా మారనున్నాయి. ఇదే క్రమంలో ఇతర కంపెనీల ఫలితాలు సైతం విడుదల కానున్నాయి. దీనికి తోడు అమెరికాలో కొనసాగుతున్న బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ డబ్బును ఆసియా మార్కెట్లతో పాటు ఇండియా ఈక్విటీల్లోకి మళ్లిస్తున్నారు. ఈ క్రమంలో డాలర్ ధర చాలా కీలకంగా మారనుంది.
ఈ క్రమంలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఇన్వెస్టర్లకు కొన్ని షేర్లను సోమవారం కొనుగోలు చేసేందుకు అనుకూలమైనవిగా సూచించింది. దీని ప్రకారం SBI, HDFC Bank, ICICI Bank, Federal Bank, Kotak Mahindra బ్యాంక్ షేర్లలో పెరుగుదల ఉండనుందని తెలిపింది. ప్రధానంగా రిజర్వు బ్యాంక్ తీసుకున్న నిర్ణయాలు ఈ ర్యాలీకి దోహదపడతాయని వారు చెబుతున్నారు. దీనికి తోడు ఇతర ప్రభుత్వ గణాంకాలు ప్రధాన పాత్ర పోషించనున్నాయి.


Click it and Unblock the Notifications