Paytm Shares: పేటీఎం కంపెనీ టైమ్ అస్సలు బాగోలేదనే చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్లోకి అరంగేట్రం నాటి నుంచి ఇప్పటి వరకు కంపెనీ అనేక ఒడిదొడుకులు, సవాళ్లకు గురవుతూనే ఉంది. చంద్రశేఖర శర్మ కంపెనీ డిజిటల్ పేమెంట్స్ చరిత్రలో కొత్త పాఠాలు రచించినా విజయానికి చేరుకోవటంలో కష్టపడుతూనే ఉంది.
పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ కంపెనీ షేర్లు బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి దాదాపు రూ.400 స్థాయికి పడిపోయాయి. వాస్తవానికి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సీఈవో, ఎండి సుపీందర్ చావ్లా వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించటం కంపెనీ షేర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపింది. దీంతో స్టాక్ భారీగానే దెబ్బతింది. అలాగే కంపెనీకి చాలా కాలంగా ప్రతికూల వార్తలు, రెగ్యులేటరీ చర్యలు, కార్పొరేట్ గవర్నెన్స్ వంచి సమస్యలు ఒకటి తర్వాత మరొకటి చుట్టుముడుతూ నష్టం కలిగిస్తూనే ఉన్నాయి.

వాస్తవానికి కంపెనీ షేర్లలో అనేక కారణాల వల్ల పదునైన సంపద క్షీణత ఉన్నప్పటికీ.. అనేక కేటగిరీలో ఇన్వెస్టర్లు మాత్రం తక్కువ ధరకు లభిస్తున్న పేమెంట్స్ దిగ్గజం షేర్లను కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడిదారులు తమ రిస్క్ ప్రొఫైల్‌ను స్వతంత్ర ప్రాతిపదికన అంచనా వేయాలని, అధిక రిస్క్ తీసుకోగలిగిన పెట్టుబడిదారులు మాత్రమే దానిపై పందెం వేయాలని మార్కెట్ భాగస్వాములు సూచిస్తున్నారు. చాలా మంది మార్కెట్ విశ్లేషకులు మాత్రం కంపెనీ షేర్లకు ప్రస్తుతం దూరంగా ఉండటం ఉత్తమమని సూచిస్తున్నారు.
సాంకేతికంగా కంపెనీ షేర్లు ఇప్పటికీ 200, 20 రోజుల EMAల ట్రేడింగ్‌గా బేరిష్ సెంటిమెంట్‌ను కలిగి ఉన్నాయి. "హై రిస్క్ అపెటిట్ ఇన్వెస్టర్లు మాత్రమే Paytmని రూ.410 శ్రేణి కంటే ఎక్కువ కొనుగోలు చేయడానికి ప్రయత్నించాలని, రూ.340 వద్ద కఠినమైన స్టాప్ లాస్‌ను పెట్టుకుని ముందుకు సాగాలని స్టాక్ మార్కెట్ టుడే వ్యవస్థాపకుడు VLA అంబాలా పేర్కొన్నారు. ఈ క్రమంలో స్టాక్ టార్గెట్ ధర రూ.500 నుంచి రూ.600గా ఉంచుకోవచ్చని సూచించారు.


Click it and Unblock the Notifications