Union Budget 2025: ప్రస్తుతం సోషల్ మీడియాలో నిర్మలా సీతారామన్ నేడు ప్రకటించిన బడ్జెట్ దేశం కోసం చేసినట్లు లేదని బీహార్ కోసం ప్రకటించినట్లు కనిపిసిస్తోందని మీమర్స్స అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల తర్వాత జూలైలో మధ్యంతర బడ్జెట్ సమయంలో కేంద్రం ఏపీ, బీహార్ రాష్ట్రాలకు సముచిత స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో యూనియన్ బడ్జెట్ 2025 నుంచి ఏపీకి దాదాపు రూ.23,000 కోట్లు కేటాయించబడ్డాయి. కొన్ని కీలక ప్రాజెక్టులకు నిర్మలమ్మ మంచి కేటాయింపులను ప్రకటించారు. ఈ క్రమంలో ప్రధానంగా ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు అత్యధికంగా బడ్జెట్లో రూ.18 వేల కోట్లను కేంద్ర బడ్జెట్ అందించింది. ప్రాజెక్టు నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్ రూపంలో రూ.12,157 కోట్లు దక్కగా.. మిగిలిన రూ.5,936 కోట్లు పోలవరం ప్రాజెక్టుకు అందించబడ్డాయి. ఇదే క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంటుకు రూ.3,295 కోట్లు కూడా దక్కాయి.

అలాగే ఏపీ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖ పోర్టుకు రూ.730 కోట్లు దక్కాయి. ఇదే క్రమంలో ఇతర రంగాలకు వచ్చిన కేటాయింపులను పరిశీలిస్తే.. ఆరోగ్య రంగానికి రూ.162 కోట్లు, నేచురల్ ఫార్మింగ్ కోసం రూ.186 కోట్లు, రోట్లు, వంతెనలు వంటి మౌలిక సదుపాయాలకు రూ.240 కోట్లు, లర్నింగ్ ట్రాన్ఫర్మేషన్ కోసం రూ.375 కోట్లను నిర్మలా సీతారామన్ నేడు కేటాయించారు. ఏపీ ఇరిగేషన్, లైవ్లీ హుడ్ ఇంప్రూవ్ మెంట్ ప్రాజెక్టు రెండో దశకు రూ.242.50 కోట్లను కేటాయించారు. ఈ నిధులను ఏపీ సర్కార్ ఎంత చాకచక్యంగా తెచ్చుకుంటుందనే అంశంపైనే అందరి దృష్టి కొనసాగుతోంది.
పోలవరానికి ప్రస్తుత బడ్జెట్లో రూ 5,936 కోట్లు దక్కిన సంగతి తెలిసిందే. పోలవరం సవరించిన అంచనాలకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. పోలవరానికి కేంద్రం కేటాయించిన రూ 12,157 కోట్లను బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించారు. ఇదే క్రమంలో విమానాశ్రయాలు, పోర్టులు, రోడ్లు, రైల్వే కనెక్టివిటీలోనూ ఏపీకి కేటాయింపులు ఉన్నట్లు తెలుస్తోంది.
బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కేంద్రం ఆ రాష్ట్రానికి ఎక్కువ సముచిత స్థానం ఇచ్చిన సంగతి తెలిసిందే. విపక్ష ఎంపీ కాంగ్రెస్ నేత జైరాం రమేష్ కూడా ఇది బీహార్ బడ్జెట్ మాదిరిగా ఉందని కామెంట్ చేశారు. మకానా బోర్డు నుంచి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, ఫుడ్ ప్రాససింగ్ యూనిట్లు అంటూ కేంద్రం పెద్ద వరాల చిట్టాను బీహార్ కోసం బడ్జెట్లో పెట్టడంపై విపక్షాలు కూడా ఆగ్రహంగా ఉన్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications