RBI News: ఈసారి వడ్డీ రేట్లు పెరుగుతాయా..? స్థిరంగా కొనసాగుతాయా..? తెలుసుకోండి
RBI News: గత సారి ద్రవ్యపరపతి సమావేశంలో రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఆర్బీఐ నిర్ణయం అనేక పెంపుల తర్వాత రావటంతో సామాన్యులకు ఊరట లభించింది.
రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో 43వ ఎంపీసీ సమావేశం జూన్ 6-8 వరకు జరగనున్నాయి. RBI తన రేట్ల పెంపు చక్రాన్ని గత సమావేశంలో పాజ్ చేసి 6.5 శాతం వద్ద రెపో రేటుతో కొనసాగిస్తోంది. దీనికి ముందు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే ప్రయత్నంలో భాగంగా రిజర్వు బ్యాంక్ మే 2022 నుంచి రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది.

అయితే ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం తగ్గిన కారణంగా ఈ సారి రేట్ల తగ్గింపు ఉంటుందా లేక గతంలో తీసుకున్న రేట్ల పెంపు బ్రేక్ కొనసాగిస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే నిపుణుల అంచనా ప్రకారం జూన్ 8న ప్రకటించే రేట్ల నిర్ణయ సమయంలో తగ్గింపులు పెంపులు లేకుండా యాథావిధిగా రేట్లు ఉండవచ్చని భావిస్తున్నారు. యూఎస్ ఫెడ్ సైతం ఈ సారి రేట్ల పెంపుకు బ్రేక్ ఇవ్వొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు.
వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 18 నెలల కనిష్ఠ స్థాయి 4.7 శాతానికి తగ్గటాన్ని MPC ఎంత వరకు పరిగణలోకి తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ క్రమంలో ఆర్‌బిఐ వడ్డీ రేట్లపై విరామం కొనసాగించి రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగించే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనామిస్ట్ మదన్ సబ్నవిస్ అన్నారు. ఇదే సమయంలో మరో పక్క రూ.2000 నోట్లను వెనక్కి తీసుకోవటం వల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగి లిక్విడిటీ పెరుగుతోంది. మరికొందరి అంచనాల ప్రకారం సెప్టెంబరు తర్వాత రేట్ల తగ్గింపులు మెుదలవ్వొచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications