Wealth creators: 2024 మెుదటి ఆరు నెలల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీని కొనసాగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ భారీ ర్యాలీతో రికార్డు గరిష్ఠాలను తాకగా.. కొన్ని ఎంపిక చేసిన స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. దీంతో ఇన్వెస్టర్లు వేలల్లో పెట్టుబడులు పెట్టి లక్షల్లో లాభాలను అందుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. జూన్ 28 వరకు శ్రీ అధికారి బ్రదర్స్ టెలివిజన్ నెట్‌వర్క్ అత్యధికంగా 7,502% లాభపడి స్టాక్ ధర రూ.245.55 స్థాయికి చేరింది. వాస్తవానికి స్టాక్ ధర డిసెంబర్ 29, 2023న మార్కెట్లో ఒక్కోటి రూ.3.23 వద్ద ఉంది. ఈ లెక్కన కంపెనీ షేర్లలో రూ.10 వేలు పెట్టుబడిగా పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుత ధర ప్రకారం రూ.7.50 లక్షలను అందుకున్నారు. భారీగా లాభపడిన కంపెనీల షేర్ల జాబితాలో రాయల్ ఇండియా కార్పొరేషన్ రెండవ స్థానంలో 814 శాతం పెరుగుదలతో రెండవ స్థానంలో నిలిచింది. ఇదే కాలంలో కాలంలో టిన్నా ట్రేడ్, మార్సన్స్, డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హెల్తీ లైఫ్ అగ్రిటెక్ కంపెనీల షేర్లు సైతం 700% కంటే ఎక్కువ రాబడిని అందించాయి.

మార్కెట్‌లో ప్రస్తుత అధిక వాల్యుయేషన్‌ల దృష్ట్యా, జాగ్రత్తగా స్టాక్ ఎంపిక చాలా కీలకం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్లలో బబుల్ ఉందని మోజో PMS చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ సునీల్ దమానియా పేర్కొన్నారు. మొమెంటం స్టాక్‌లను అనుసరించే బదులు, నాణ్యమైన స్టాక్‌లలో పెట్టుబడి పెట్టాలని అన్నారు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో మొమెంటం స్టాక్‌లు బాగా పనిచేసినప్పటికీ, ద్వితీయార్ధం నాణ్యమైన స్టాక్‌లకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేశారు. ఈ క్రమంలో మార్కెట్ కరెక్షన్స్ జరిగితే నష్టాలు తగ్గించుకోవచ్చని అన్నారు.
ఇదే క్రమంలో ఇన్వెస్టర్లకు 500 శాతం కంటే ఎక్కువ రాబడులను అందించిన వివిధ షేర్లను పరిశీలిస్తే.. ఎరయా లైఫ్‌స్పేసెస్ 602%, స్ప్రైట్ ఆగ్రో 575%, బొండాడ ఇంజనీరింగ్ 568%, సీనిక్ ఎక్స్‌పోర్ట్స్ 553%, ఇంటెగ్రా స్విచ్‌గేర్ 509%, ఎయిర్‌పేస్ ఇండస్ట్రీస్ 506% రాబడిని తమ పెట్టుబడిదారులకు 2024 మెుదటి ఆరు నెలల కాలంలో అందించాయి.


Click it and Unblock the Notifications