G20 Summit: ప్రస్తుతం మెుత్తం ఇన్వెస్టర్ల కళ్లు భారత్ నిర్వహించనున్న జీ20 సమావేశంపై ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడి సంస్థలు, ఇన్వెస్టర్లు సైతం ఇక్కడ జరగనున్న పరిణామాలపై ఆసక్తిగా ఉన్నారు.
భారత అధ్యక్షతన దేశ రాజధాని దిల్లీ వేదికగా సమ్మిట్ సెప్టెంబర్ 9,10 రెండు రోజుల పాటు కొనసాగనుంది. ఈ క్రమంలో రాజధానికి అగ్రదేశాల నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా IT, బ్యాంకింగ్, ఫార్మాస్యూటికల్స్, ఫిన్‌టెక్ కంపెనీలు వంటి రంగాలపై ఎక్కువ ఫోకస్ ఉంటుందని తెలుస్తోంది. వైట్ హౌస్ ప్రకారం యూఎస్ ప్రెసిడెంట్ బిడెన్ ప్రధాని నరేంద్ర మోడీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు.

పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యుత్తమమైన ఇండియా గ్రోత్ స్టోరీ జీ20 ప్రెసిడెన్సీతో విస్తృత దృష్టిని, ప్రశంసలను పొందుతోందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వికె విజయకుమార్ అన్నారు. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మాస్యూటికల్స్ అత్యంత లాభదాయకమైన రంగాలుగా పెట్టుబడులను ఆకర్షిస్తాయన్నారు. భారత డిజిటల్ ఎకోసిస్టమ్ ప్రపంచవ్యాప్తంగా అనుకరణీయమైన మోడల్‌గా అంగీకరించబడిందన్నారు. ఫిన్‌టెక్ కంపెనీల వృద్ధిని ఆకర్షిస్తుందని పేర్కొన్నారు.
G20 ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ ఆర్థికంలో 85% వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ GDP, వాణిజ్యంలో 75%, ప్రపంచ జనాభాలో 66%, ప్రపంచ భూభాగంలో దాదాపు సగం కలిగి ఉన్నాయి. G20లో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ వంటి 19 దేశాలు ఉన్నాయి. సదస్సులో వాణిజ్యం, వాతావరణ మార్పు, స్థిరమైన అభివృద్ధి, ఆరోగ్యం, వ్యవసాయం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పు అవినీతి వ్యతిరేకత వంటి వాటి మధ్య అజెండాను విస్తరించింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications