Investment: సూపర్ రిచ్ ధనవంతులు వేటిలో ఇన్వెస్ట్ చేస్తారో తెలుసా..??
Investment: సామాన్య ప్రజలకు ఎప్పటికీ అర్థం కాని ఒక విషయం ఏమిటంటే.. ధనవంతులు వారి సంపదను ఎలా రెట్టింపు చేసుకుంటారు అన్నదే. ఏళ్లు గడిచినా ఈ సంపద అంతరాయం పెరుగుతూనే ఉంది తప్ప తరగటం లేదు.
2023 వెల్త్ రిపోర్ట్ ప్రకారం అల్ట్రా హై నెట్ వర్త్ వ్యక్తులు తమ సంపదలో 50 శాతాన్ని ఇళ్లు, ఈక్విటీల కొనుగోలులో పెట్టుబడి పెడుతున్నట్లు వెల్లడైంది. ఈ వర్గంలో నికర విలువ మూడు కోట్ల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ కేటగిరీకి చెందిన ధనికులు తమ మొత్తం సంపదలో దాదాపు 32 శాతం ఇళ్లను కొనుగోలు చేసేందుకు వెచ్చిస్తున్నారు. వీరు సగటున 3.7 ఇళ్లు కలిగి ఉన్నారు.

అల్ట్రా రిచ్ కేటగిరీలోని వ్యక్తులు తమ మొత్తం సంపదలో 18 శాతాన్ని ఈక్విటీ షేర్లలో పెట్టుబడిగా పెట్టినట్లు నివేదిక పేర్కొంది. అలాగే తమ సంపదలో 14 శాతాన్ని సంపన్నులు కమర్షియల్ ప్రాపర్టీ కొనుగోలు కోసం వెచ్చిస్తున్నట్లు వెల్లడైంది. వీరికి ఆఫీసులు, పారిశ్రామిక రియల్ ఎస్టేట్‌లలో ప్రత్యక్ష యాజమాన్యం ఉంటుంది. అలాగే సంపదలో 12 శాతాన్ని బాండ్లలో పెట్టుబడి పెట్టగా.. 6 శాతం సంపదను ప్రైవేట్ ఈక్విటీలు లేదా వెంచర్ క్యాపిటల్ రూపంలో పెట్టుబడిగా పెట్టారు. అలాగే మొత్తం సంపదలో ఐదు శాతాన్ని కమర్షియల్ ప్రాపర్టీ ఫండ్‌లో పెట్టుబడులు కలిగి ఉన్నారు.
మరో పక్క ధనవంతులు సేఫ్ హెవెన్ బంగారం, బిట్ కాయిన్ వంటి క్రిప్టో ఆస్తులతో పాటు యాంటిక్స్, పెయింటింక్స్ వంటి కళల్లో తమ సంపదను పెట్టుబడిగా పెడుతున్నారని నివేదిక పేర్కొంది. నవంబర్ 2022లో 500 మంది అసెట్ మేనేజర్ల మధ్య నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ నివేదిక తయారు చేయబడింది. ఈ అసెట్ మేనేజర్లు సంపన్నులకు చెందిన దాదాపు 205 ట్రిలియన్ డాలర్ల ఆస్తులను నిర్వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications