Success Story: స్టార్టప్ కల్చర్ దేశంలో పెరగటంతో చాలా మంది తమ కలలను నెరవేర్చుకునేందుకు అవకాశాలు అపారంగా పెరిగాయి. పెట్టుబడిదారులు సైతం విరివిగా దొరుకుతున్నారు. ఈ క్రమంలో సాంప్రదాయ వ్యాపార దిగ్గజాలను తలదన్నేలా అనేక కంపెనీలు పుడుతున్నాయి.
బ్యూటీ ఉత్పత్తుల సంస్థ Nykaaను ఫల్గుణి నాయర్ స్థాపించారు. గత ఏడాది కంపెనీని ఐపీవోగా మార్కెట్లోకి తీసుకొచ్చారు. సొంతంగా కంపెనీని స్థాపించి దేశంలోని అత్యంత ధనికుల జాబితాలో ఒకరుగా ఆమె చేరారు. మంచి ఉద్యోగాన్ని వదులుకుని తన వ్యాపార ప్రస్తానాన్ని మెుదలు పెట్టారు. ప్రస్తుతం ఈ కంపెనీని వారసులు అంచిత్ నాయర్, అద్వైత నాయర్ ముందుకు తీసుకెళుతున్నారు. ఈ కవలలు ఇషా అంబానీ కొత్తగా ప్రారంభించిన బ్యూటీ బ్రాండ్ Tiraతో పోటీ పడుతూ కంపెనీని కొత్త ఎత్తులకు తీసుకెళ్లారు.

ఫల్గుణి నాయర్ కుమార్తె అద్వైత నాయర్ బైన్ అండ్ కంపెనీలో తన కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన తల్లితో కలిసి Nykaa సహ వ్యవస్థాపకురాలు అయ్యారు. ఆమె Nykaa ఆఫ్‌లైన్ స్టోర్‌లను స్థాపించడంలో సహాయపడి.. ఆదాయం పెరుగుదలకు దోహదపడ్డారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా ఉన్న అంచిత్ నాయర్ ఉద్యోగాన్ని వీడి సోదరిని వ్యాపారంలో అనుకరిస్తున్నారు. వీరిద్దరూ ప్రస్తుతం కంపెనీ డైరెక్టర్ల బోర్డులో ఉన్నారు.
వీరిద్దరూ తల్లి ఫల్గుణి నాయర్ కి 2.7 బిలియన్ డాలర్ల నికర విలువను నిర్మించటంలో సహాయపడ్డారు. నవంబర్ 2022 నాటికి ఇటీవలి రౌండ్ ఫండింగ్ తర్వాత Nykaa విలువ 13 బిలియన్ డాలర్లు.. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. అలాగే అద్వైత, అంచిత్ నాయర్ కూడా 2022లో ఫార్చ్యూన్ అండర్ 40 జాబితాలోకి ప్రవేశించారు. ప్రస్తుతం వీరు ఇషా అంబానీ తీరా బ్యూటీ, టాటా క్లిక్, పర్పుల్ వంటి పెద్ద కంపెనీలతో పోటీ ఉన్నప్పటికీ నైకాను ముందుకు తీసుకెళుతున్నారు.


Click it and Unblock the Notifications