Google Resume: ప్రపంచ టెక్ కంపెనీల్లో గూగుల్ ప్రఖ్యాతి గాంచింది. ఈ అమెరికన్ కంపెనీలో పనిచేయాలని చాలా మంది టెక్కీలు కలలు కంటుంటారు. అయితే ఇక్కడ ఉద్యోగం పొందటం అంత ఈజీ కాదు.
గణాంకాల ప్రకారం గూగుల్ లో ఉద్యోగం సంపాదించాలనే ఆశయంతో దాదాపు 20 లక్షల మందికి పైగా దరఖాస్తు చేస్తుంటారు. ఈ కంపెనీలో జాప్ కొట్టడం చాలా కష్టం.. దీనికోసం ముందుగా మీరు రెజ్యూమ్‌పై పనిచేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. 2012-15 మధ్య కాలంలో కంపెనీలో రిక్రూటర్ గా పనిచేసిన లోలన్ చర్చ్ ఇదే విషయాన్ని వెల్లడించారు. చాలా మంది ఉద్యోగార్ధులు చేసే రెండు పెద్ద తప్పుల గురించి తాజాగా వెల్లడించారు.

గూగుల్ లో జాబ్ కోసం అప్లై చేసే వారు ముందుగా తమ రెజ్యూమ్‌లో పెద్దపెద్ద పేరాలు రాయటం మానుకోవాలని సూచించారు. మీరు చెప్పాలనుకున్నది సూచిగా ఉంచాలని తెలిపారు. సంక్షిప్తంగా వివరించలేకపోతే మీరు కార్యాలయంలో కూడా సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయలేరని పేరాలు సూచిస్తాయన్నారు. అందువల్ల hatGPT లేదా Grammarly వంటి AI సాధనాలను ఉపయోగించాలని నోలన్ చర్చ్ తెలిపారు. అలాగే రెండవ విషయం ఏమిటంటే.. మీ నైపుణ్యాలు, సామర్థ్యాల గురించి క్లుప్తంగా వివరించాలని తెలిపారు.
కంపెనీలో 20 సంవత్సరాలు గడిపిన మరొక మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ లాస్లో బాక్ కొన్ని తప్పుల గురించి తెలిపారు. తాను దాదాపు 20 వేల కంటే ఎక్కువ రెజ్యూమ్లను చూశానన్నారు. ముందుగా స్పెల్లింగ్ తప్పులు, అక్షర దోషాలు ఉండకూడదని చెప్పారు. అలాగే ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లిన తర్వాత రెజ్యూమ్ అంత పట్టింపు ఉండని తెలిపారు. అలాగే అనవసరమైన వివారాలను తగ్గించాలని అన్నారు. సంక్షిప్తమైన రెజ్యూమ్ మీకు మంచి ఉద్యోగాన్ని అందించగలదని సూచించారు.


Click it and Unblock the Notifications