EV Cars: రానున్న 5 ఏళ్లలో దేశంలో అత్యధిక సంఖ్యలో ఈవీ వాహనాలను మనం రోడ్లపైనే చూడబోతున్నాం. ఈ క్రమంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించటంతో పాటు కర్బర ఉద్ఘారాలను అరికట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది.
ఈ క్రమంలో రానున్న యుగం ఈవీలదేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 34.54 లక్షల రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. వీటిలో ప్రజాధరణ పొందిన టాప్-5 ఎలక్ట్రిక్ కార్లను వాటి ప్రస్తుత ధరలను పరిశీలిద్దాం..

ముందుగా దేశీయ కార్ మేరక్ టాటాలకు చెందిన టాటా నెక్సన్ ఈవీ ఎక్కువగా ప్రజాధరణను పొందుతోంది. మంచి బిల్డ్ క్వాలిటీతో పాటు సేఫ్టీ ఫీచర్లతో ఇది ఎక్కువ మంది కార్ లవర్లను ఆకర్షిస్తోంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే కారు 465 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తోంది. అలాగే ఈ కారు ప్రారంభ ధర రూ.14.7 లక్షల నుంచి రూ.20 లక్షలుగా ఎక్స్ షోరూమ్ ధర కొనసాగుతోంది. ఇక రెండో స్థానంలో నిలిచిన ఎంజీ కామెట్ ఈవీ కారు నిలిచింది. ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 230 కిలోమీటర్లు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ ఈవీ ఎక్స్-షోరూమ్ ధర రూ.8 లక్షలుగా ఉంది.
మూడో స్థానంలో సౌత్ కొరియాకు చెందిన హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఈవీ ఐయోనిక్ 5 టాప్ కారుగా నిలిచింది. కేవలం 7.6 సెకన్లలో 100 కిమీ వేగాన్ని అందుకోగలిగిన కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 630 కిలోమీటర్లు ప్రయాణించేందుకు వెసులుబాటు కల్పిస్తోంది. కారు ఎక్స్ షోరూమ్ ధర దాదాపు రూ.46 లక్షలుగా ఉంది. ఇక ఇండియన్ కార్ మేకర్ మహీంద్రాకు చెందిన XUV400 ఈవీ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. ఈ కారు మేలేజ్ రేంజ్ పరిశీలిస్తే 375 నుంచి 456 కిలోమీటర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాదే ఈ కారు రూ.16 లక్షల ప్రారంభ ధర నుంచి హై వేరియంట్ రూ.19.19 లక్షలకు అందుబాటులో ఉంది. ఇక చివరిగా సిట్రోయెన్ ఈసీ3 కారు నిలిచింది. ఇది సింగిల్ ఛార్జ్ ద్వారా 320 కిలోమీటర్లు ప్రయాణించేందుకు వీలు కల్పిస్తోంది. అలాగే దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.11.60 లక్షల నుంచి రూ.12.79 లక్షలుగా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications