Super Stocks: కొత్త ఏడాది ప్రారంభమైన నాటి నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు విపరీతంగా పెరిగిపోయాయి. వాస్తవానికి దీనికి కారణం కీలక సూచీలు ఆల్ టైమ్ రికార్డు గరిష్ఠాలకు చేరుకోవటమే.
జనవరి 25తో ముగిసిన వరుస రెండవ ట్రేడింగ్ వారంలోనూ దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల స్వీకరణ ధోరణి కనిపించింది. ఈ కాలంలో ఎఫ్ఐఐల అమ్మకాలు, నెలవారీ ఎఫ్ అండ్ ఓ ముగింపు గడువు, క్యూ3 మిశ్రమ ఆదాయాలు వంటి అంశాలు ప్రాఫిట్ బుకింగ్ కారణాలుగా ఉన్నాయి. బేర్స్ రంగంలోకి దిగటంతో వారంలో మార్కెట్లు భారీ పతనాన్ని సైతం చూశాయి.

ఈ క్రమంలో బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ సూచీలు నష్టాలను నమోదు చేశాయి. అయితే ఇలాంది ప్రతికూల మార్కెట్ పరిస్థితుల్లో రెండింతలు లాభాలను నమోదు చేసిన స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఐఎఫ్సీఐ, ట్రాన్స్ ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా, సల్సార్ టెక్నో ఇంజనీరింగ్, ఐఎఫ్బీ ఇండస్ట్రీస్, వికాస్ ఇండస్ట్రీస్, బోరోసిల్ రెన్యూవబుల్స్ లిమిటెడ్, హెచ్ఎల్వీ, ALLSEC టెక్నాలజీస్, స్టీల్ ఎక్స్ఛేంజీ, ధనుశ్రీ వెంచర్స్, ఓస్వాల్ గ్రీన్ టెక్, ది బాంబే డయింగ్ కంపెనీ, మహానగర్ టెలిఫోన్ నిగమ్ కంపెనీ, వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ కంపెనీ షేర్లు 15 నుంచి 37 శాతం రాబడిని జనవరి 20-25 మధ్య కాలంలో అందించాయి.
అలాగే 10- 15 శాతం వరకు రిటర్న్స్ అందించిన స్మాల్ క్యాప్ కంపెనీ షేర్లను పరిశీలిస్తే.. స్టెర్లిన్ అండ్ విల్సన్ రెన్యూవబుల్స్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్పెషాలిటీ రెన్యూవబుల్స్, ఇండియా నిప్పాన్ ఎలక్ట్రికల్స్, మెజిల్లానిక్ క్లౌడ్, ఎన్ బిసిసి ఇండియా, ఆనంద్ రాఠీ వెల్త్, రాంకీ ఇన్ ఫ్రా స్ట్రక్టర్, వికాస్ లైఫ్ కేర్, ఎన్ఎమ్డీసీ స్టీల్, ఇన్ఫీబీన్స్ అవెన్యూస్, మంగళూరు కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, గుజరాత్ అంబుజా ఎక్స్ పోర్ట్స్, గణేష్ హౌసింగ్ కార్పొరేషన్, అంబర్ ఎంటర్ ప్రైజెస్, లాయిడ్ ఎంటర్ ప్రైజెస్, గాంధీ స్పెషల్ ట్యూబ్స్ కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు సూపర్ లాభాలను అందించాయి.


Click it and Unblock the Notifications