Investment: అంతర్జాతీయంగా ఆర్థిక అస్థిరతలు తలెత్తిన నేపథ్యంలో స్టార్ మార్కెట్లలో ఒడిదొడుకులు నెలకొన్నాయి. అయితే ఈ క్రమంలో అసలు ఏ స్టాక్స్ కొనొచ్చు, ఏవి సరైనవి అనే అనుమానాలు చాలా మంది ఇన్వెస్టర్లలో ఉన్నాయి.

ఐఐఎఫ్ఎల్ డైరెక్టర్..
ఈ క్రమంలో ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ డైరెక్టర్ సంజీవ్ భాసిన్ మాత్రం కొన్ని షేర్లను ఎంచుకున్నారు. ప్రస్తుత తరుణంలో విదేశీ ఇన్వెస్టర్లకు భారత మార్కెట్లు నమ్మదగినవిగా ఉన్నాయని.. అవి మంచి రాబడులను అందించగలవని సంజీవ్ అభిప్రాయపడుతున్నారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్ సైతం వడ్డీ రేట్ల పెంపు విషయంలో నెమ్మదిగా వెళ్లాలని నిర్ణయించిన తరుణంలో దేశీయ మార్కెట్లు తిరిగి ఊపందుకుంటున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు సైతం ఆల్ టైమ్ రికార్డు గరిష్ఠాలను తాకుతున్నాయి.

రెండు రోజుల కిందట..
నవంబర్ 24న మార్కెట్లు ఆల్ టైం రికార్డు స్థాయిలను చేరుకోవటంతో.. ఆ తర్వాత దేశీయ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండటంతో సూచీలు స్వల్ప లాభాలతో ఫ్లాట్ గా ముగిశాయి. చైనాలో కరోనా నియంత్రణకు లాక్ డౌన్ల రాకతో చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు మెుగ్గు చూపుతున్నారు.

సంజీవ్ భాసిన్ ఎంపిక చేసుకున్న స్టాక్స్..
ప్రాథమిక అంచనా ప్రకారం సంజీవ్ మెుదటగా జీ ఎంటర్‌టైన్‌మెంట్ స్టాక్ ఎంచుకున్నారు. సోనీతో విలీనం చివరి దశలో ఉన్నందున కంపెనీని ఆదాయం సైతం పెరగవచ్చని అంచనా వేశారు. ఇక రెండవ స్టాక్ గా ఆయన అల్ట్రాటెక్ సిమెంట్ ఎంచుకున్నారు. సిమెంట్ తయారీ మార్కెట్లో ఈ బిర్లా కంపెనీ ACC & అంబుజా రెండింటి కంటే రెట్టింపు తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీంతో తక్కువ ఖర్చుకే ఉత్పత్తిని అందించగలదని అంచనా వేశారు.

టాప్-5 స్టాక్ పిక్స్..
ఈ సంవత్సరం రెండవ అర్థ భాగంలో కాన్ఫిన్ హోమ్స్ మంచి గ్రోత్ కలిగి ఉంది. హౌసింగ్ మార్కెట్ బూమ్ తో పాటు కంపెనీ మార్కెట్లో 3వ అతిపెద్ద మార్టగేజ్ లెండర్ గా ఉంది. రూ.15-30 లక్షల లోన్ అందిస్తున్న కేటగిరీలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తోంది. ఇక నాలుగవ ఎంపికగా ఉన్న DLF మంచి అమ్మకాలతో పాటు రుణ భారం కనిష్ఠ స్థాయిలకు తెచ్చుకోగలిగింది. చివరిగా సంజీవ్ ఎంచుకున్న స్టాక్ L&T. కంపెనీ మిడిల్ ఈస్ట్ లో మంచి పనితీరుతో పాటు బలమైన ఆర్డర్ బుక్ కలిగి ఉండటం ఆయనను ఆకర్షించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications