Best Performing Funds: సాధరణంగా మనలో చాలా మంది బ్యాంకులు ఇచ్చే 6 శాతం వడ్డీ కోసం ఆశపడుతుంటాం. అయితే మ్యూచువల్ ఫండ్స్ 60 శాతానికి పైగా రాబడిని అందించటం గురించి అరుదుగా వింటుంటాం. చాలా మందికి సరైన ఫండ్స్ ఎంచుకోవటంపై అవగాహన లేకపోవటంతో ఈ స్థాయిలో రాబడులను పొందలేకపోతుంటారు. ఊళ్లో వచ్చే రెండు రూపాయల వడ్డీ కంటే డబుల్ రాబడిని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు గమనిస్తే..
సెప్టెంబర్ 2024లో దాదాపు సగం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు వాటి బెంచ్‌మార్క్‌లను అధిగమించాయి. నెలాఖరు నాటికి మొత్తం 137 ఫండ్‌లు తమ బెంచ్‌మార్క్‌లను అధిగమించాయని ప్రభుదాస్ లీలాధర్ వెల్త్ మేనేజ్‌మెంట్ ఇటీవల ఒక రిపోర్టులో వెల్లడించింది. దీంతో ఈక్విటీ ఫండ్స్ కింద దేశంలో పెట్టుబడులు ఆగస్టులో సెప్టెంబర్ కంటే 3.1 శాతం పెరిగి రూ.25.64 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇది దేశంలోని మ్యూచువల్ ఫండ్లలోకి ప్రవేశిస్తున్న ప్రజల డబ్బును సూచిస్తోంది. కేటగిరీల వారీగా వివిధ పథకాల పనితీరును పరిశీలిస్తే..

లార్జ్ క్యాప్ ఫండ్ కేటగిరీలో క్వాంట్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ ఏడాది కాలంలో 45.88% ఆకట్టుకునే రాబడిని అందించింది. దీని తర్వాత బరోడా BNP పారిబాస్ లార్జ్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 45.16%, బంధన్ లార్జ్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 44.23% రాబడిని అందించి టాప్ స్థానాల్లో ఉన్నాయి. ఇదే క్రమంలో లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీని పరిశీలిస్తే.. ఇన్వెస్కో ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్ 61.08 శాతం రాబడిని అందించగా, మోతీలాల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 60.53 శాతం రాబడిని అందించింది.
ఇక ఫ్లెక్సీ క్యాప్ కేటగిరీని పరిశీలిస్తే మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 62.83 శాతం రాబడిని అందిచంగా, జేఎమ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 59.04 శాతం రాబడిని అందించింది. ఇదే క్రమంలో మిడ్ క్యాప్ కేటగిరీలో బెస్ట్ రాబడిని ఇచ్చిన ఫండ్స్ గురించి పరిశీలిస్తే.. మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 71.80 శాతం రాబడిని అందించగా, ఎడీల్వెస్సీ మిడ్ క్యాప్ ఫండ్ 60.25 శాతం, ఐటీఐ మిడ్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్ 61.47 శాతం రాబడిని అందించింది. ఇదే క్రమంలో స్మాల్ క్యాప్ కేటగిరీని పరిశీలిస్తే.. బాంధన్ స్మాల్ క్యాప్ ఫండ్ 72.13 శాతం రాబడితో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్ క్యాప్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 59.54 శాతం రాబడిని అందించింది.
ఇక వ్యాల్యూ కాంట్రా డివిడెండ్ ఈల్ట్ ఫండ్లలో క్వాంట్ వ్యాల్యూ ఫండ్67.04 శాతం రాబడిని అందిస్తోంద. ఇక ELSS స్కీమ్స్ పనితీరును పరిశీలిస్తే.. మోతీలాల్ ఓస్వాల్ ELSS ట్యాక్స్ సేవర్ రెగ్యులర్ గ్రోత్ ఫండ్ 66.56 రాబడితో అసాధారణ ఫలితాలను అందించి ఈ కేటగిరీలో తొలిస్థానంలో నిలిచింది. దీని తర్వాతి స్థానంలో ఎస్బీఐ టెర్మ్ ఈక్విటీ ఫండ్ 54.46 శాతం రాబడిని అందించి ఇన్వెస్టర్ల సంపదను భారీగా పెంచాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications