Year Ender 2023: ఈ ఏడాది ఇన్వెస్టర్లను ధనవంతులు చేసిన మ్యూచువల్ ఫండ్స్ ఇవే.. కొన్నారా..??
Year Ender 2023: ఈ ఏడాది మ్యూచువల్ ఫండ్స్‌కు లాభదాయకమైన సంవత్సరంగా మారింది. డిసెంబర్ మొదటి వారం మార్కెట్ల అనూహ్య ర్యాలీ ఇన్వెస్టర్లకు మంచి రాబడులను తెచ్చిపెట్టింది.
మరికొద్ది రోజుల్లో కొత్త ఏడాది ప్రారంభం అవుతున్న వేళ చాలా మంది కొత్త పెట్టుబడులను ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నారు. దీనికి ముందు స్టాక్ మార్కెట్లలోని బెంచ్ మార్క్ సూచీలు ఏడాదిలో స్థిరంగా కొత్త గరిష్టాలను తాకాయి. అలాగే డిసెంబర్ 8న శుక్రవారం ట్రేడింగ్‌లో మార్కెట్ కూడా కొత్త గరిష్టాలను తాకింది. ముందుగా సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ సూచీలు సరికొత్త ఆల్ టైమ్ హైని తాకింది. ఆ తర్వాత నిఫ్టీ-50 ఇండెక్స్ కూడా కొత్త గరిష్టాలకు ఎగబాకింది.

ఈ క్రమంలో.. జాతీయ స్టాక్ మార్కెట్ సూచీ ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఈ ఏడాది తొలిసారిగా 21,000 మార్క్‌ను దాటింది. నిఫ్టీ-50 ఇండెక్స్ ఈ ఏడాది ఇప్పటివరకు 15% పైగా లాభపడగా, BSE సెన్సెక్స్ ఇప్పటివరకు 14.15% లాభపడి 70,000 మార్క్‌ను దాటింది. ఇదే సమయంలో స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు బెంచ్ మార్క్ సూచీల కంటే రెట్టింపు వృద్ధిని నమోదు చేశాయి. ఈ ర్యాలీ పరోక్షంగా మ్యూచువల్ ఫండ్స్ ప్రయోజనాన్ని అందుకుంటున్నాయి. వివిధ కేటగిరీల షేర్లు మెరుగైన పనితీరు కనబరుస్తున్నందున.. కేటాయింపుల వారీగా ఫండ్ హౌస్ వివిధ పథకాలు అలాగే ఉన్నాయి.
వివిధ కేటగిరీల్లో టాప్-10 మ్యూచువల్ ఫండ్స్ రాబడులను వివరాలు పరిశీలిస్తే..
- HDFC స్మాల్ క్యాప్ ఫండ్: 51.5%
- క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: 45.69%
- HDFC మిడ్-క్యాప్ ఆపర్చునిటీ ఫండ్: 44.13%
- నిప్పాన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్: 39.4%
- మహీంద్రా మాన్యులైఫ్ మిడ్ క్యాప్ ఫండ్: 37.26%
- SBI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్: 37.18%
- నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్: 36.16%
- నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్: 34.57%
- మహీంద్రా మాన్యులైఫ్ మల్టీ క్యాప్ ఫండ్: 33.79%
- JM ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్: 30.91%


Click it and Unblock the Notifications