SIP Investment: కొన్ని నెలలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు, బ్యాంకింగ్ రంగం కంటే ఇన్వెస్టర్లు తమ డబ్బును ఎక్కువగా మ్యూచువల్ ఫండ్లలోకి మళ్లించేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఎస్ఐపీ పెట్టుబడులకు సంబంధించిన పవర్ ఇన్వెస్టర్లు గ్రహిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ పాపులర్ కావటంతో అనేక ఏఎంసీలు సైతం పుట్టుకొచ్చాయి. కొత్త ఫండ్స్ లాంచ్ ప్రస్తుతం ఎక్కువగా మార్కెట్లలో కనిపిస్తోంది.
ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు మంచి రాబడులను తెచ్చిపెట్టిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఫండ్ ప్రవేశపెట్టినప్పటి నుంచి సిప్ ప్రారంభించిన పెట్టుబడిదారులు మంచి రాబడులను అందుకున్నారు. ఈ ఫండ్స్ 80 శాతం పెద్ద స్టాక్‌లలో డబ్బును ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మార్కెట్ క్యాప్ పరంగా టాప్ 100 కంపెనీలు లార్జ్ క్యాప్ కంపెనీలుగా పరిగణించబడతాయి. ఇవి ప్రాథమికంగా బలమైనవి. అందువల్ల దీర్ఘకాలంలో అనేక లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు స్థిరత్వాన్ని చూపించడమే కాకుండా మంచి రిటర్న్స్ అందించాయి. ఎవరైనా ఇన్వెస్టర్ నెలకు రూ.7500 చొప్పున ఈ టాప్-5 ఫండ్స్ లో మెుదటి నుంచి ఇన్వెస్ట్ చేసినప్పుడు వారు ఎటువంటి రాబడులను అందుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

- ముందుగా HDFC టాప్ 100 ఫండ్ గురించి చూస్తే ఈ ఫండ్ సెప్టెంబర్ 1996లో ప్రారంభించబడింది. దీనికింద రూ.37783 కోట్లు నిర్వహణలో ఉన్నాయి. ప్రారంభం నుంచి ఫండ్ 19.52 శాతం రాబడిని అందించింది. ఎక్స్‌పెన్స్ రేషియో 1.6 శాతంగా ఉంది. 28 ఏళ్ల కాలంలో ఫండ్ నెలకు రూ.7500 సిప్ కొనసాగించిన వ్యక్తులకు రూ.7.28 కోట్ల రాబడిని అందించింది.
- ఇక మంచి రాబడులను అందించిన రెండవ ఫండ్ టాటా లార్జ్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్. ఈ ఫండ్ మే 1998లో ప్రారంభమైంది. ప్రారంభం నుంచి ఫండ్ ఇన్వెస్టర్లకు 19.71 శాతం వార్షిక రాబడిని అందించింది. దీని ఎక్స్‌పెన్స్ రేషియో 2.04 శాతంగా ఉంది. దీనిలో కనీస సిప్ రూ.100గా ఉంది. గడచిన 26 ఏళ్లుగా నెలకు రూ.7500 సిప్ కొనసాగించిన వ్యక్తులు రూ.3.80 కోట్లు రాబడిని అందుకున్నారు.
- మంచి రాబడులను అందించిన మూడో ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్‌లైన్ ఈక్విటీ ఫండ్ - రెగ్యులర్ ప్లాన్. 2002లో ప్రారంభించబడిన ఫండ్ వార్షికంగా పెట్టుబడిదారులకు 17.39 శాతం రాబడిని అందించింది. ఫండ్ కింద రూ.30,607 కోట్లు నిర్వహణలో కొనసాగుతున్నాయి. దీని ఎక్స్‌పెన్స్ రేషియో 1.63 శాతంగా ఉండగా.. 22 ఏళ్ల పాటు సిప్ కొనసాగించిన వ్యక్తుల పెట్టుబడి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1.86 కోట్లకు చేరుకుంది.
- టాప్ రాబడిని ఇచ్చిన ఫండ్లలో నిప్పాన్ ఇండియా ఇటిఎఫ్ నిఫ్టీ తదుపరి 50 జూనియర్ బీఈఎస్ కూడా చోటు దక్కించుకుంది. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఫిబ్రవరి 2003లో ప్రారంభమైనప్పటి నుంచి 16.91 శాతం వార్షిక రాబడిని అందించింది. దీని ఎక్స్‌పెన్స్ రేషియో 2.37 శాతంగా ఉంది. 21 ఏళ్ల కాలంలో సిప్ కొనసాగించిన వ్యక్తులు ప్రస్తుతం విలువ ప్రకారం రూ.1.48 కోట్లు అందుకున్నారు.
- చివరిగా అద్భుతమైన రాబడిని అందించిన మ్యూచువల్ ఫండ్ గా నిప్పాన్ ఇండియా ఇటిఎఫ్ నిఫ్టీ 50 బీఈఎస్ నిలిచింది. ఈ ఫండ్ 2001 డిసెంబరులో ప్రారంభించబడింది. అప్పటి నుంచి వార్షికంగా ఇన్వెస్టర్లు 15.23 శాతం రాబడిని అందుకున్నారు. ఫండ్ కింద్ రూ.32,713 కోట్లు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కలిగి ఉంది. దీని ఎక్స్‌పెన్స్ రేషియో 0.04 శాతంగా ఉంది. గడచిన 22 ఏళ్ల కాలంలో రూ.7500 నెలవారీ సిప్ కొనసాగించిన వ్యక్తుల పెట్టుబడి విలువ ప్రస్తుతం మార్కెట్ లెక్కల ప్రకారం రూ.1.38 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications