IPO News: రెండు వారాల్లో 2023 ముగుస్తోంది. ఈ క్రమంలో చాలా కంపెనీలు స్టాక్ మార్కెట్ల ర్యాలీతో మంచి పనితీరును కనబరిచాయి. ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులను అందించి వారిని ధనవంతులుగా మార్చాయి. అయితే ఇప్పుడు సక్సెస్ ఫుల్ ఐపీవోల గురించి తెలుసుకుందాం..
ఈ ఏడాది మార్కెట్లోకి వచ్చిన అనేక ఐపీవోలు సూపర్ లాభాలను అందించి మల్టీబ్యాగర్లుగా నిలిచాయి. గొప్ప రాబడులను అందించిన టాప్ ఐపీవోల జాబితాలో.. Cyient DLM, Tata Technologies, Senco Gold వంటి కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. ఈ క్రమంలో తక్కువ కాలంలోనే విపరీతమైన లాభాలను అందించాయి.

పెట్టుబడిదారులకు ఊహించని రాబడులను అందించిన టాప్ ఐపీవోగా ఈ ఏడాది Cyient DLM నిలిచింది. జూలై 10న మార్కెట్లో లిస్టింగ్ సమయంలో 58 శాతానికి పైగా రాబడిని అందించింది. ఆ తర్వాత సైతం ఐపీవో తన పెట్టుబడిదారులకు 145 శాతానికి పైగా రాబడిని అందించింది. వాస్తవాని ఐపీవో ఇష్యూ ధర రూ.265గా ఉండగా.. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.778.90గా ఉంది. ఇక మంచి రాబడులను అందించిన జాబితాలో టాటా టెక్నాలజీస్ ఐపీవో రెండవ స్థానంలో నిలిచింది. ఐపీవో 140 శాతం ప్రీమియం ధరకు జాబితా చేయబడి బీఎస్ఈలో రూ.1199.95 వద్ద అడుగుపెట్టింది. అయితే ప్రస్తుతం కంపెనీ 52 వారాల గరిష్ఠ ధర రూ.1400గా నిలిచింది.
మూడో స్థానంలో రాబడులతో నిలిచిన EMS లిమిటెడ్ ఐపీవో సెప్టెంబర్ 21న జాబితా చేయబడింది. వాస్తవానికి కంపెనీ షేర్లను రూ.211 రేటు వద్ద ఇష్యూ చేసినప్పటికీ ఇన్వెస్టర్లకు 119 శాతం రాబడిని అందించింది. అలాగే సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చిన సిగ్నేచర్ గ్లోబల్ ఐపీవో రూ.350 రేటుకు ఇష్యూ చేసినప్పటికీ ఎన్ఎస్ఈలో రూ.800 వద్ద బీఎస్ఈలో రూ.809.9 రేటు వద్ద జాబితా చేయబడ్డాయి. ప్రస్తుతం కంపెనీ కొత్త 52 వారాల గరిష్ఠాన్ని తాకే దిశగా పయనిస్తోంది.
ఇక సూపర్ రాబడులను అందించిన ఐపీవోల జాబితాలో.. విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ 5వ స్థానంలో నిలిచింది. ఈ స్టాక్ 104 శాతం రాబడిని ఇచ్చింది. లిస్టింగ్ సమయంలో ఎన్ఎస్ఈలో రూ.165 ధర వద్ద, బీఎస్ఈలో ఐపీవో రూ.163.3 రేటు వద్ద జాబితా చేయబడింది.


Click it and Unblock the Notifications