Samvat 2080: సంవత్ 2079లో భారత స్టాక్ మార్కెట్లు గ్లోబల్ మార్కెట్లను అధిగమించి మెరుగైన పనితీరును కనబరిచాయి. ఇదే ధోరణి సంవత్ 2080లో కూడా కొనసాగాలని ఇన్వెస్టర్లు కోరుకుంటున్నారు.
ఈ క్రమంలో భారతీయుల సెంటిమెంట్లకు అనుగుణంగా ఎన్ఎస్ఈ, బీఎస్ఈ నవంబర్ 12 అంటే ఆదివారం రోజున ఒక గంట పాటు ప్రత్యేకంగా మురుహత్ ట్రేడింగ్ నిర్వహిస్తుంది. ఈ సమయంలో షేర్ల క్రయవిక్రయాలు చేయటం ద్వారా ఆర్థిక అభివృద్ధి లభిస్తుందని హిందువులు ప్రధానంగా నమ్ముతారు. అందుకే ఈ సమయంలో ఎంతో కొంత మెుత్తంతో తమ పెట్టుబడులను ప్రారంభిస్తుంటారు.

కొత్త సంవత్సరానికి ఏ కంపెనీలను తమ పెట్టుబడి కోసం ఎంచుకోవాలో తెలియక చాలా మంది సతమతమౌతున్నారు. ఈ క్రమంలో జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సతీష్ మీనన్ మధ్యస్థ, దీర్ఘకాలిక పెట్టుబడిదారులను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లను కొనుగోలుకు అనుకూలమైనవిగా పేర్కొన్నారు. రిలయన్స్ విషయానికి వస్తే.. జియో ప్లాట్‌ఫారమ్‌లకు పెరుగుతున్న చందాదారులు, డేటా ట్రాఫిక్, వ్యయ సామర్థ్యాలు, దేశవ్యాప్తంగా 5G సేవలు, Jio AirFiber,పెరిగిన గ్యాస్ ఉత్పత్తి సానుకూల అంశాలుగా ఉన్నాయి. దీంతో ఒక ఏడాదిలో షేరుకు రూ.2,641ని టార్గెట్ ధరగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. JM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లో సీనియర్ VP-రీసెర్చ్ అయిన నిఖిల్ కపూర్ కూడా RILని సిఫార్సు చేస్తూ రూ.2,900 టార్గెట్ ధరగా పేర్కొన్నారు.
బ్రోకరేజ్ తన రెండవ షేరుగా HDFC బ్యాంక్ ను ఎంచుకుంది. ప్రస్తుతం నికర వడ్డీ మార్జిన్ దిగజారినప్పటికీ.. సమీప కాలంలో క్రమంగా రికవరీ బాట పండుతుందని అంచనా వేస్తున్నట్లు మీనన్ పేర్కొన్నారు. గృహ రుణాలను అందించే వ్యాపారాన్ని హెచ్‌డిఎఫ్‌సిలో విలీనం మధ్యస్థ, దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో హెచ్‌డిఎఫ్‌సి షేరుకు రూ.1,964ను టార్గెట్ ధరగా పేర్కొన్నారు.
ఇక చివరగా JM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లో సీనియర్ VP-రీసెర్చ్ అయిన నిఖిల్ కపూర్ L&T షేర్లపై సానుకూలతను వ్యక్తం చేశారు. దేశీయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, మధ్యప్రాచ్యం నుంచి ఆర్డర్ ఇన్‌ఫ్లో స్థిరమైన ఊపందుకోవడం వల్ల ప్రయోజనాలను అందిస్తుందని అంచనా వేశారు. దీంతో కంపెనీ షేర్లకు రానున్న ఏడాదిలో రూ.3,430 టార్గెట్ ధరగా పేర్కొన్నారు. ఇదే క్రమంలో అరిహంత్ క్యాపిటల్ మార్కెట్‌లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అర్పిత్ జైన్, సంభావ్య మార్కెట్ ఔట్ పెర్ఫార్మెన్స్ కోసం తన అగ్ర ఎంపికలుగా L&T, UPL లిమిటెడ్, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లను ఎంచుకున్నారు.


Click it and Unblock the Notifications