Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల ర్యాలీ తర్వాత చివరికి మంచి లాభాల్లోనే ప్రయాణాన్ని ముగించాయి. క్లోజింగ్ సమయంలో కొనసాగిన లాభాల స్వీకరణ కారణంగా సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల క్షీతను చూసింది.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 655 పాయింట్ల లాభంలో ప్రయాణాన్ని ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 203 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 339 పాయింట్ల లాభంలో, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 238 పాయింట్ల లాభంలో క్లోజ్ అయ్యాయి. ప్రధానంగా నేడు మార్కెట్లు ముగిసే సమయానికి అన్ని రంగాల సూచీలు లాభదాయకంగా నిలిచాయి.

నేడు మార్కెట్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగించటానికి 5 అంశాలు దోహదపడ్డాయి. ఇటీవల సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఆర్థిక సంస్థల పనితీరుపై కఠినంగా వ్యవహరించటంతో పాటు ఇతర చర్యల కారణంగా బ్యాంకింగ్ స్టాక్స్ లో కొనుగోళ్ల కోలాహలం నమోదైంది. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలు, నిన్న అమెరికా మార్కెట్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించటం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్లను బలపరించింది. అలాగే విదేశీ సంస్థాగత మదుపరులు నుంచి కనిపించిన కొనుగోళ్లు దేశీయ పెట్టుబడిదారులకు మార్కెట్లపై నమ్మకాన్ని పెంచాయి. దీనికి తోడు టెక్నికల్స్, మ్యాక్లో ఎకనమిక్ సూచీలు పెట్టుబడిదారుల దూకుడు కొనుగోళ్లకు ప్రేరణగా నిలిచింది.
ఎన్ఎస్ఈలో గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, నెస్లే, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, సిప్లా, దివీస్ ల్యాబ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, విప్రో కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, రిలయన్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications