Mutual Funds: ఈ మూడు ఫండ్స్ పట్టుకున్నోళ్లకి లాభాల పంటే.. మీరూ కొన్నారా..?
MF Investments: మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడికి అనేక స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రధానంగా ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఫేమస్. గడచిన ఏడాది వీటిలో ఇన్వెస్ట్ చేసినవారు ఏకంగా 53 శాతం రాబడిని అందుకున్నారు.
ఇదే క్రమంలో స్మాల్ క్యాప్ ఫండ్స్ సైతం దుమ్ముదులిపాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ పథకాలు.. నిఫ్టీ స్మాల్ క్యాప్ 250, BSE 250 స్మాల్ క్యాప్ సూచీల పనితీరును ప్రతిబింబిస్తుంది. ఈ కేటగిరీలో మంచి పనితీరును కనబరిచిన మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ పరిశీలిస్తే..

-మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్:
ఈ స్కీమ్ గడచిన ఏడాది కాలంలో తన పెట్టుబడిదారులకు 53.33 శాతం రాబడిని అందించింది. అయితే ఈ రాబడి నిఫ్టీ 250 ఇండెక్స్ అందించిన 54.97 శాతం కంటే తక్కువనే చెప్పుకోవాలి. గత మూడు సంవత్సరాల్లో ఫండ్ పనితీరును పరిశీలిస్తే.. 30.69 శాతంగా ఉంది. ఇందులో బీఎస్ఈ లిమిటెడ్, సయ్యంట్, ఏంజెల్ వన్, ఐటీఎఫ్సీ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, సోనాటా సాఫ్ట్వేర్, సీడీఎస్ఎల్ వంటి కంపెనీల ఈక్విటీలలో పెట్టుబడులు ఉన్నాయి.
1 సంవత్సరం రిటర్న్స్ - 53.33 శాతం
3 సంవత్సరాల రిటర్న్స్ - 30.69 శాతం
-నిప్పాన్ ఇండియా నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్:
స్కీమ్ గడచిన ఏడాది కాలంలో తన పెట్టుబడిదారులకు 53.06 శాతం రాబడిని అందించింది. అలాగే మూడేళ్ల కాలంలో పనితీరును పరిశీలిస్తే 30.68 శాతం రాబడిని ఇన్వెస్టర్లు పొందారు. ఈ ఫండ్ BSE లిమిటెడ్, Scient Limited, RBL బ్యాంక్, ఏంజెల్ వన్ వంటి కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టింది.
1 సంవత్సరం రిటర్న్స్ - 53.06 శాతం
3 సంవత్సరాల రిటర్న్స్ - 30.68 శాతం
-మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్:
చివరిగా మిడ్ క్యాప్ విభాగంలో మంచి పనితీరును కనబరిచిన ఈ స్కీమ్ ఏడాది కాలంలో పెట్టుబడిదారులకు 47.02 శాతం రాబడిని అందించింది. ఇది వాస్తవానికి నిఫ్టీ మిడ్‌క్యాప్ 150 ఇండెక్స్ అందించిన 48.35 శాతం రాబడి కంటే తక్కువని చెప్పుకోవాలి. అలాగే గత మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే కంపెనీ 27.65 శాతం రాబడిని అందించింది.
1 సంవత్సరం రాబడి - 47.02 శాతం
3 సంవత్సరాల రాబడి - 27.65 శాతం


Click it and Unblock the Notifications