Budget Expectations: కేవలం బడ్జెట్ ప్రకటనకు ఇంకా 48 గంటల సమయం మాత్రమే ఇంకా మిగిలి ఉంది. ఎన్నో ఆశలు, ఇంకెన్నో అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి స్థానంలో ఉన్న తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్ తన ప్రసంగానికి సంసిద్ధం అవుతున్నారు. వరుసగా 8వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆమెపై ఈసారి ఒత్తిడి కొద్దిగా ఎక్కువగానే ఉంది. సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు కోరుతున్న కీలక డిమాండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రధానంగా బడ్జెట్లో ఆదాయపు పన్ను తగ్గింపు నుంచి పొదుపు ప్రోత్సాహకాలు వరకు అనేక మార్పులను దేశంలోని ప్రజల నుంచి వినతుల వర్షం కురుస్తోంది. అయితే నిర్మలమ్మ వీటిలో ఎన్నింటిపై స్పందిస్తారనే విషయం బడ్జెట్ తర్వాతే తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో టాప్-10 వినతులకు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. ముందుగా ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్ ప్రసంగంలో వేతనజీవులకు పన్ను రేట్ల తగ్గింపు ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పన్ను స్లాబ్‌లను సవరించడాన్ని ప్రభుత్వం పరిగణించాలని వారు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా నిపుణుల నుంచి వేతనజీవుల వరకు చాలా మంది పన్ను చెల్లింపుదారులు రూ.10 లక్షల వరకు ఆదాయంపై పన్ను మనహాయింపు కోరుతున్నారు. ఇది ప్రజల వద్ద పునర్వినియోగానికి చేతిలో ఉండే డబ్బును లభ్యతను పెంచి వినియోగాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. కన్జమ్షన్ పై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టాలని వారు చెబుతున్నారు.
2. ఇకపోతే పన్ను శ్లాబ్ రేట్ల తర్వాత పన్ను చెల్లింపుదారులు కోరుతున్నది న్యూ టాక్స్ రీజిమ్ కింద హోమ్ లోన్ ప్రయోజనాలు. కొత్త పన్ను విధానంలో ప్రయోజనాలను అందించడం ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంటి యాజమాన్యాన్ని ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
3. సెక్షన్ 24(బి) కింద గృహ రుణాలపై అధిక వడ్డీ మినహాయింపును బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటించాలని పన్ను చెల్లింపుదారులతో పాటు నిపుణులు సూచిస్తున్నారు. ఒక ఇంటి కొనుగోలు రుణంపై చెల్లించే మొత్తం వడ్డీపై మినహాయింపు అవసరమని లేదా ప్రస్తుతం ఉన్న వడ్డీ రాయితీ విషయంలో రూ.2 లక్షల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని డిమాండ్ వినిపిస్తోంది.
4. పొదుపు విషయానికి వస్తే దేశంలో చాలా మంది పెట్టుబడులను కలిగి ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ విషయంలోనూ వినతులు ఉన్నాయి. NPS కింద మినహాయింపును రూ.50 వేల నుంచి రూ.లక్షకి పెంచాలని టాక్స్ టూ విన్ సీఈవో అభిషేక్ సోనీ వెల్లడించారు. డబ్బు ఉపసంహరణను పన్ను రహితంగా చేయాలన్నారు.
5. టైర్-2 పట్టణాలైన హైదరాబాద్, పూణె, బెంగళూరు వంటి నగరాలకు 50% HRA మినహాయింపును పొడిగించాలని టాక్స్ టూ విన్ సీఈవో అభిషేక్ సోనీ సిఫార్సు చేసింది.
6. పెరుగుతున్న ఆరోగ్య ఖర్చులతో పాటు అనారోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో.. సెక్షన్ 80డి కింద పన్ను మినహాయింపు పరిమితిని రూ.25,000, రూ.50 వేలు ఉన్న వ్యక్తులకు డబుల్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ద్రవ్యోల్బణ సమయంలో ప్రజలపై పెరుగుతున్న భారాన్ని తగ్గిస్తుందని వారు చెబుతున్నారు.
7. చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం పీఎఫ్ చెల్లిస్తున్నారు. అయితే ఇందులో పొందే వడ్డీపై టీడీఎస్ వాయిదా వేయాలని కోరుతున్నారు.
8. గత ఏడాది బడ్జెట్ ప్రకటన సమయంలో మూలధన లాభాలపై పన్ను పెంపును ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే వీటిని తిరిగి పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ లాభాలపై లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 12.5 శాతానికి పెంచగా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ 20 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఎస్టీటీ ఛార్జీల విషయంలోనూ తగ్గింపు అవసరమని వినతులు ఉన్నాయి.
9. సీనియర్ సిటిజన్‌లకు వారి ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించడానికి మరింత ఉదారంగా మినహాయింపు పరిమితులను అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
10. ఫిక్స్‌డ్ డిపాజిట్స్, పీపీఎఫ్ మొదలైన ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, ప్రోత్సహించడానికి పన్ను ఆదా చాలా ముఖ్యం. అయితే వీటి విషయంలో నిబంధనలు 2014 నుంచి ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగుతున్నట్లు నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications