Market Next Week: గడచిన వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. వారం మెుదట్లో నష్టాలు భారీగా ఆందోళనను గురిచేసినప్పటికీ ఆ తర్వాత తిరిగి కోలుకున్నాయి.
అయితే ఇప్పుడు అందరి దృష్టి రాబోతున్న వారం ఎలా ఉంటుందనే ఆందోళనలు చాలా మంది పెట్టుబడిదారులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈ క్రమంలో దేశంలోని కార్పొరేట్ కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను ప్రకటించటంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. దీనికి తోడు అమెరికా, ఇండియాకు సంబంధించిన ద్రవ్యోల్బణం డేటాతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలు కొత్త ట్రేడింగ్ వారంలో మానసిక స్థితిని నిర్దేశించడానికి సిద్ధంగా ఉన్నాయి.

జనవరి 5తో ముగిసిన వారంలో నిఫ్టీ 0.1 శాతం నష్టంతో 21,710 వద్ద ముగియగా.. సెన్సెక్స్ 0.3 శాతం క్షీణించి 72,026 వద్ద ముగిసింది. సెక్టార్ల వారీగా నిఫ్టీ రియాల్టీ 7.8 శాతం, నిఫ్టీ మీడియా 3.3 శాతం టాప్ గెయినర్లుగా నిలిచాయి. ఇదే క్రమంలో ఐటీ 1.9 శాతం క్షీణించగా, మెటల్స్ 1.3 శాతం క్షీణించి టాప్ లూజర్లుగా నిలిచాయి. వార్షిక ప్రాతిపదికన పరిశ్రమలు, ఆటోలు, సిమెంట్‌లకు లాభాల వృద్ధి బలంగా ఉంటుందని దలాల్ స్ట్రీట్ అంచనా వేస్తోంది. కానీ BFSI, FMCG, IT, రసాయనాలు, వినియోగదారు సేవలకు బలహీనంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నాయి.
బీఎస్ఈ క్యాలెండర్ ప్రకారం వచ్చేవారం జనవరి 8 నుంచి జనవరి 13 మధ్య కాలంలో దాదాపు 65 కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించటానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. టీసీఎస్ జనవరి 11న, ఇన్ఫోసిస్ జనవరి 11న, HCL టెక్ జనవరి 12న, విప్రో జనవరి 12న, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ జనవరి 12న ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటికి తోడు చమురు ధరలు, ఎర్ర సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దేశీయ ఆర్థిక డేటా పాయింట్లతో పాటు మార్కెట్లోకి వస్తున్న కొత్త ఐపీవోలు రానున్న వారం మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.


Click it and Unblock the Notifications