Paytm News: పేటీఎంలో గుర్తించిన అతిపెద్ద తప్పు ఇదే.. రిజర్వు బ్యాంక్ సీరియస్ అందుకే..
Paytm Crisis: చాలా మందికి అర్థం కాని విషయం ఏమిటంటే అసలు భారతీయ రిజర్వు బ్యాంక్ స్టార్టప్ కంపెనీ పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఎందుకంత సీరియస్ అయ్యిందనే విషయంపైనే. అయితే దీనికి సంబంధించిన తాజా వివరాలు బయటకు వచ్చాయి.
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‍పై రిజర్వ్ బ్యాంక్ పరిమితులు విధించడానికి ఒక కారణం సరైన గుర్తింపు లేకుండా వందలాది ఖాతాలను సృష్టించడం. సరైన సమాచారం లేకుండా సృష్టించబడిన ఈ ఖాతాలు ప్లాట్‌ఫారమ్‌లో కోట్లు విలువైన లావాదేవీలను నిర్వహించాయి. అందువల్ల కేవైసీ సరిగా పూర్తి చేయని ఖాతాల నుంచి మనీలాండరింగ్ జరిగి ఉండొచ్చే ఆందోళనలు పెరుగుతున్నాయి.

నియంత్రణ సంస్థల పరిశీలనలో దాదాపు 1000 ఖాతాలు ఒకే పాన్ కార్డుతో లింక్ చేసినట్లు కనుగొనబడింది. అలాగే అసాధారణ సంఖ్యల్లో ఇన్‌యాక్టివ్ అకౌంట్లను గుర్తించటంతో అనుమానాలు రేకెత్తాయి. వెరిఫికేషన్ ప్రక్రియలో సెంట్రల్ బ్యాంక్, ఆడిటర్లు తప్పుడు సమ్మతి సమర్పించినట్లు కనుగొనబడింది. ఇంకా గ్రూప్ మరియు లింక్డ్ పార్టీలలో బహిర్గతం చేయని ప్రధాన లావాదేవీలు రెగ్యులేటరీ ఆందోళనలను విస్తరించాయి. అలాగే పేమెంట్ కంపెనీ మాతృ సంస్థ One97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ మధ్య కనెక్షన్‌లో కూడా ఆర్బీఐ పాలనాపరమైన సమస్యలను గుర్తించింది.
ఈ క్రమంలో పేటీఎం ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించే కొంతమంది వ్యాపారులు విచారణకు గురయ్యారని ప్రతినిధి తెలిపారు. ఇదే క్రమంలో మనీలాండరింగ్ ఆరోపణలను కంపెనీ ఖండించింది. కంపెనీలో నిబంధనల పాలనా లోపాలతో పాటు డేటా గోప్యతాపరమైన సమస్యలను గుర్తించటంతో రిజర్వు బ్యాంక్ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా లావాదేవీలను నిలిపివేసింది. ఫిబ్రవరి 29 వరకు బ్యాంక్ కార్యకలాపాలు థర్డ్-పార్టీ బ్యాంకులపై ఆధారపడి ఉండనున్నాయి. ఈ క్రమంలో అటు పెట్టుబడిదారులను, ఇటు సీఈవో విజయ్ శేఖర్ శర్మ కంపెనీలోని ఉద్యోగులను శాంతింపజేసి వారిలో భయాలను తొలగించి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సమస్యను వీలైనంత వేగంగా పరిష్కరించేందుకు శర్మ టీంతో పాటు స్టార్టప్ వ్యవస్థాపకులు ప్రయత్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications