Hindenburg Shutdown: అమెరికాకు చెందిన పెట్టుబడి, రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ప్రస్తుతం క్లోజ్ చేయాలని నిర్ణయించబడింది. సంస్థ వ్యవస్థాపకుడు నాటె యాండర్సన్ దీనికి సంబంధించిన ప్రకటనను బుధవారం వెలువరించారు. ప్రస్తుతం తాము పనిచేస్తున్న ప్రాజెక్టులు ముగిసిన తరుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కేవలం 10 మంది ఉద్యోగులతో 2012లో స్థాపించబడిన ఈ సంస్థ అనేక కంపెనీలు అకౌంటింగ్ లోపాలు లేదా చేస్తున్న తప్పులను బయటపెట్టింది. ఈ క్రమంలో టార్గెట్ చేయబడిన అనేక కంపెనీల మార్కెట్ విలువను కరిగించేంది. దీంతో పెట్టుబడిదారులు నష్టాలను చూశారు. అలాగే బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ ఆవిరైపోయింది. ఈ క్రమంలోనే షార్ట్ సెల్లర్ భారతీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ ను టార్గెట్ చేసింది. కంపెనీ కార్పొరేట్ మోసాలకు పాల్పడిందని వెల్లడించింది.

హిండెన్‌బర్గ్ అతిపెద్ద విజయం ఎలక్ట్రిక్ ట్రక్ తయారీదారు నికోలాపై వచ్చింది. అవును 2020లో దాని టెక్నాలజీ స్థితి గురించి అబద్ధాలు చెప్పిందని ఆరోపించింది. 1937లో జర్మనీకి చెందిన హిండెన్‌బర్గ్ ఎయిర్‌షిప్ న్యూజెర్సీలోకి ఎగురుతున్నప్పుడు మండిన హై-ప్రొఫైల్ ప్రమాదం పేరు మీద హిండెన్‌బర్గ్ అనే పేరు పెట్టారు. హిండెన్‌బర్గ్ కంపెనీ టార్గెట్ చేసిన 7 పెద్ద కేసుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
- ముందుగా 2023 జనవరి చివరిలో భారతీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ కంపెనీల వ్యాపారాలపై హిండెన్ బర్గ్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇది అదానీ కంపెనీల మార్కెట్ విలువను వేల కోట్ల మేర కరిగించేసింది. అయితే తర్వాతి కాలంలో పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని నింపటంతో స్టాక్స్ తిరిగి నష్టాల నుంచి పుంజుకోగలిగాయి. అలాగే భారతీయ స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ చీఫ్ మాదబీ పూరీబుచ్, ఆమె భర్త దవెల్ బుచ్ అదానీకి సహకరించారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
- 2020లో నికోలా కంపెనీ ఎలక్ట్రిక్ ట్రక్కుల తయారీలో తన వద్ద టెక్నాలజీ ఉందని పెట్టుబడిదారులను మోసం చేసినట్లు హిండెన్ బర్గ్ బయటపెట్టడంతో సభలమైంది. కంపెనీ విడుదల చేసిన వీడియోలో అధిక వేగం సాధించినట్లు చూపటాన్ని అబద్ధంగా రుజువు చేసింది.
- అలాగే 2023లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇకాన్ ఎంటర్‌ప్రైజెస్ LP ఆర్థిక నివేదికలపై విమర్శించింది. కంపెనీ తన పెట్టుబడిదారులకు అతిగా అంచనా వేసి డివిడెండ్‌లను చెల్లించడానికి "పోంజీ లాంటి" నిర్మాణంపై ఆధారపడిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. దీంతో కంపెనీ షేర్ల పతనం దాదాపు 3 బిలియన్ డాలర్ల మేర ఇకాన్ నికర విలువ తగ్గటానికి దారితీసింది.
- 2023లో కంపెనీ బ్రాక్ ఇంక్ కంపెనీలో కలిగి ఉన్న షార్ట్ పొజిషన్లను బహిర్గతం చేసింది. ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే నేతృత్వంలోని చెల్లింపుల సంస్థ తన వినియోగదారుల సంఖ్యను ఎక్కువగా చూపించిందని, కస్టమర్ అక్విజిషన ఖర్చులను తక్కువగా చూపించిందని ఆరోపించింది. క్రెడిట్ కార్డ్ పరిశ్రమను కదిలించే లక్ష్యంతో 2009లో తన శాన్ ఫ్రాన్సిస్కో అపార్ట్‌మెంట్‌లో బ్లాక్‌ను సహ-స్థాపించిన డోర్సేకి ఈ చర్య ఒక సవాలుగా భావించబడింది.
- 2022లో హిండెన్‌బర్గ్ ట్విట్టర్ ఇంక్‌లో షార్ట్, లాంగ్ పొజిషన్లను కలిగి ఉంది. మే నెలలో ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఒప్పందం నుండి వైదొలిగితే, కంపెనీని ప్రైవేట్‌గా తీసుకోవడానికి ఎలోన్ మస్క్ $44 బిలియన్ల కొనుగోలు చేయనున్నట్లు వచ్చిన వార్తలతో షార్ట్ పొజిషన్లు తీసుకున్నాడు. అయితే జూలైలో యాండర్ సన్ తాను కంపెనీలు తీసుకున్న లాంగ్ పొజిషన్ల వివరాలను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.
- 400 మిలియన్ డాలర్ల పోంజీ స్కీమ అయిన J&J పర్చేజింగ్ పై హిండెన్‌బర్గ్ దర్యాప్తు 2022లో ఆ సంస్థ దాచిన నిఘా ఫుటేజ్‌ను సంపాదించడంతో ప్రారంభమైంది. ఈ ఫుటేజ్ J&J మార్కెటర్లు మోసపూరిత పెట్టుబడి పథకాలను ప్రయోగిస్తున్నట్లు వెల్లడైంది. ఇది నాటకీయంగా FBI జోక్యానికి దారితీసింది. దీని ఫలితంగా ప్రతిష్టంభన ఏర్పడింది.
వాస్తవానికి హిండెన్ బర్గ్ తన మెుత్తం ప్రయాణంలో దాదాపు 63 కంపెనీలను టార్గెట్ చేసింది. ప్రస్తుతం వీటిలో 51 కంపెనీలు ఇప్పటికీ నష్టాల్లో కొనసాగటం సదరు సంస్థ సక్సెస్ రేటును సూచిస్తుంది. ఈ క్రమంలో అదానీకి చెందిన 4-5 లిస్టెడ్ కంపెనీలు కూడా నష్టాల్లోనే కొనసాగటం గమనార్హం.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications