IT News: దేశంలోని ఐటీ సేవల కంపెనీల పనితీరు అంచనాలకు ముందు అందరూ యాక్సెంచర్ ప్రకటించే ఎర్నింగ్ ప్రెడిక్షన్స్ ప్రతిసారి చూస్తుంటారు. ఇది దేశీయ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో సహా టాప్ టెక్ కంపెనీల పనితీరును అంచనా వేసేందుకు దోహదపడుతుంది.
యాక్సెంచర్ ఐర్లాండ్‌లోని డబ్లిన్ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న గ్లోబల్ ఐటి సేవల సంస్థ. కంపెనీ తాజాగా తన మూడో త్రైమాసిక కోసం సూచనను ప్రచురించింది. ఈ అంచనాలు రాబోయే త్రైమాసికాల్లో భారతీయ ఐటీ సేవల పరిశ్రమకు సంబంధించిన వ్యాపార అవకాశాలపై ముందస్తు పరిశీలనను అందిస్తాయి. ప్రస్తుతం యాక్సెంచర్ ఫలితాలు ఆశాజనకంగా ఉండటం ఐటీ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లకు నమ్మకాన్ని పెంచుతున్నాయి.

ఇక్కడ మనలో చాలా మందికి వచ్చే సహజమైన అనుమానం భారతీయ ఐటీ కంపెనీలకు యాక్సెంచర్ ఆర్థిక స్థితి ఎందుకు ముఖ్యం అన్నదే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇండియన్ ఐటీ కంపెనీల వ్యాపారంలో 90-95 శాతం విదేశాల్లోనే జరుగుతున్నాయి. అందువల్ల వ్యాపార పోకడలకు సంబంధించిన అవగాహన పొందటానికి యాక్సెంచర్ రిపోర్ట్ పనికొస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే యాక్సెంచర్ భారతదేశంలోని టాప్ పెర్ఫార్మింగ్ ఐటి దిగ్గజాల్లో ఒకటిగా ఉంది.
యాక్సెంచర్ తన Q3 పనితీరు అంచనాలను విడుదల చేసింది. ఈ క్రమంలో సంస్థ మేనేజ్డ్ సర్వీసెస్ విభాగం బాగా పనిచేస్తుందని ప్రకటించింది. వాస్తవానికి భారతీయ ఐటీ కంపెనీలకు కూడా ఈ విభాగం ప్రధాన బలం. మూడవ త్రైమాసికంలో యాక్సెంచర్ మేనేజ్డ్ సేవల ఆదాయం 2 శాతం పెరిగి 8.01 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది. ఇదే క్రమంలో పెద్ద డీల్స్ పొందేందుకు అగ్ర టెక్ కంపెనీల మధ్య కొనసాగుతున్న పోరు కారణంగా పోటీలో మధ్యతరగతి ఐటీ కంపెనీలు నష్టపోవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత కఠినమైన ఆర్థిక వాతావరణంలో ఖర్చులను తగ్గించే ఒప్పందాలు సాధారణంగా పెద్ద కంపెనీలకు వెళ్తాయి.
యాక్సెంచర్ 2024 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయ అంచనాలను తగ్గించింది. ముందుగా 1- 3 శాతం వృద్ధిని అంచనా వేయగా.. దానిని ప్రస్తుతం 1.5-2.5 శాతానికి సవరించింది. గత సంవత్సరంతో పోల్చితే త్రైమాసికంలో యాక్సెంచర్ ఆదాయం 1 శాతం తగ్గి 16.5 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తోంది. కంపెనీ వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 55,000 మంది నైపుణ్యం కలిగిన డేటా & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఉన్నారని సీఈవో జూలీ స్వీట్ వెల్లడించారు. అలాగే 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి డేటా & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్‌ఫోర్స్‌ను 40,000 నుంచి 80,000కి రెట్టింపు చేయాలనే లక్ష్యం దిశగా తమ కంపెనీ ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications