Summer Stocks 2025: గడచిన కొన్ని వారాలుగా దేశీయ స్టాక్ మార్కెట్లు కరెక్షన్ మోడ్ లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో లక్షల మంది ఇన్వెస్టర్లు అటు ఐపీవోలు లేక ఇటు మార్కెట్ల కరెక్షన్ కారణంగా స్తబ్థుగా ఉంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది సీజనల్ స్టాక్స్ పై బెట్ వేసేందుకు ఉన్న మంచి అవకాశాలను పరిశీలించాలని చూస్తున్నారు.
నేడు మహాశివరాత్రి. సహజంగా శివరాత్రి తర్వాత చలికాలం ముగిసి వేసవి మెుదలవుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి మార్చి నెల రాకమునుపే ఎండలు దంచికొడుతున్నాయి. ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వేసవిని తట్టుకునేందుకు ప్రజలు ఏసీలు, కూలర్లు వంటి గృహోపకరణాలను కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు. దీంతో డిమాండ్ ని తట్టుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా డీలర్లు సైతం తమ గోదాములను స్టాకుతో నింపేస్తున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లో నిపుణులు టాటాలకు చెందిన ఓల్టాస్, హావెల్స్ ఇండియా కంపెనీలపై సానుకూలంగా ఉన్నారు.

ప్రముఖ బ్రోకరేజ్ బీఎన్పీ పరిబాస్ మాట్లాడుతూ కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులపై ఎలాంటి రేట్ల పెంపును ప్రకటించలేదని వెల్లడించింది. అలాగే ఏసీలు, కంప్రషర్ల విషయంలో ఎలాంటి షార్టేజే లేదని వారు చెబుతున్నారు. ఇదే క్రమంలో సమ్మర్ సేల్ పెంచుకునేందుకు అనేక కంపెనీలు వివిధ ఉత్పత్తులపై తగ్గింపులు, డిస్కౌంట్లు అందించటానికి ఇప్పటికే సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లకు ఇప్పటివరకు డిమాండ్ తక్కువగానే ఉంది. ధరల పెరుగుదలను అడ్డుకుందని బ్రోకరేజ్ వెల్లడించింది. గత సంవత్సరం మార్జిన్ ఒత్తిడి గురించి ఆందోళనలు ఎక్కువగా ధర తగ్గినట్లు కనిపిస్తున్నాయని పేర్కొంది.
దక్షిణ భారతదేశంలో ఫ్యాన్లకు డిమాండ్ పెరిగింది. డీలర్లు ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లకు బలమైన వేసవిని ఆశిస్తున్నారని, సీజన్ దగ్గరగా ధరల పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నారని బిఎన్‌పి పారిబాస్ ఇండియా తెలిపింది. ఈ క్రమంలో బ్రోకరేజ్ ఆరు స్టాక్‌లపై 10-36 శాతం పెరుగుదలను అంచనా వేస్తోంది. వాటిలో వర్ల్‌పూల్ ఆఫ్ ఇండియా టార్గెట్ ధర రూ.1,310, 36 శాతం పెరుగుదల, క్రాంప్టన్ టార్గెట్ ధర రూ.435, 32 శాతం పెరుగుదల, ఓరియంట్ ఎలక్ట్రిక్ టార్గెట్ ధర రూ.275, 30 శాతం పెరుగుదల, హావెల్స్ ఇండియా టార్గెట్ ధర రూ.1,950, 28 శాతం పెరుగుదల, వోల్టాస్ టార్గెట్ ధర రూ.1,580, 24 శాతం పెరుగుదల, పాలీక్యాబ్ టార్గెట్ ధర రూ.6,405, 10 శాతం పెరుగుదలను అంచనా వేయబడ్డాయి.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications