Infosys: ఐటీ వైపుకు భారత్ బుడిబుడి అడుగులు వేస్తున్న కాలం అది. అప్పుడే కేవలం రూ.10,000లతో ప్రారంభమైంది ఇన్ఫోసిస్ ప్రస్థానం. ఒకప్పుడు చిన్న మెుక్కల ప్రారంభమైన కంపెనీ ఇప్పుడు దేశంలోని టాప్ ఐటీ సేవల కంపెనీగా ఎదిగి ఆ రంగంలో మహావృక్షంగా మారింది. పునాదుల నుంచి ఇప్పటి వరకు కంపెనీ ప్రస్థానం పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఐటీ కీలక పాత్ర..
ప్రపంచ ఐటీ రంగంలో భారత పాత్ర.. భారత ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ పాత్ర చాలా కీలకమైనవి. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణపు మైలురాయిని చేరుకుంది. ఇది భారతదేశపు మెుదటి స్టార్టప్ అని చెప్పుకోవచ్చు. దీనిని ఎన్ ఆర్ నారాయణ మూర్తి, నందన్ నీలేకనితో సహా ఏడుగురు వ్యక్తులు సంయుక్తంగా 1981లో స్థాపించారు. నారాయణమూర్తి తనవాటా పెట్టుబడి కోసం భార్య నుంచి రూ.10,000 అప్పుగా తీసుకోవటంతో భాగస్వామిగా మారారు.

లక్షల కోట్ల కంపెనీ..
మార్చి 2022 నాటికి ఇన్ఫోసిస్ విలువ రూ.6.65 లక్షల కోట్లుగా ఉంది. ఈ క్రమంలో కంపెనీ ఆదాయం రూ.16.3 బిలియన్లుగా నమోదు చేసింది. కంపెనీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు విస్తరించగా.. 3,45,000 మందికి ఉపాధిని అందిస్తోంది. అలాగే కంపెనీ అమెరికా స్టాక్ మార్కెట్ నాస్‌డాక్‌లో 1999లో జాబితా చేయబడిన తొలి భారతీయ కంపెనీగా రికార్డును సృష్టించింది. 2021లో 100 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్ మార్క్‌ను దాటిన రెండవ భారతీయ సాంకేతిక సంస్థ కావటం విశేషం. అలా కంపెనీ తన ప్రస్థానంలో అనేక మైలురాళ్లను నమోదు చేసింది.

కంపెనీ వివాదాలు..
2014లో విశాల్ సిక్కాను కంపెనీకి మొదటి బయటి సీఈవోగా నియమించిన తర్వాత ఇన్ఫోసిస్ తీవ్ర వివాదానికి గురైంది. కానీ ప్రస్తుతం కంపెనీ సీఈవోగా ఉన్న సలీల్ పరేఖ్ సీఈవోగా 2018లో రావటంతో కంపెనీ కొంత పుంతలు తొక్కుతూ వేగంగా వృద్ధి బాటలో నడుస్తోంది. కంపెనీ వృద్ధి ఏకంగా నాలుగు రెట్లు పెరగటంలో ఆయన కృషి కలకమైనది. పరేఖ్ కింద స్థిరమైన కరెన్సీలో FY22లో 19.7% రాబడి వృద్ధిని సాధించింది.

పోటీ ప్రపంచంలో..
కంపెనీ డిజిటల్ రాబడి పరేఖ్ నేతృత్వంలో 25.5% నుంచి 58.5%నికి పెరిగింది. క్లౌడ్ ఆధారిత సేవలు, ఆటోమేషన్ సాంకేతికతలను అందిపుచ్చుకోవటం తీవ్రమైన పోటీ మధ్య ఇన్ఫోసిస్ నిలబడటానికి సహాయపడింది. కానీ పరేఖ్ పదవీకాలంలో ఉన్న ఏకైక ప్రతికూలత నిర్వహణ మార్జిన్‌లో తగ్గుదల మాత్రమే. అయితే కంపెనీ లాభదాయకత కంటే వృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందనటానికి ఇది సరైన సాక్ష్యంగా నిలుస్తోంది. వీటన్నింటి మధ్య నాలుగు దశాబ్ధాల కంపెనీ చరిత్రలో సహ వ్యవస్థాపకుడు NR నారాయణ మూర్తి తర్వాత కంపెనీకి పరేఖ్ రెండవ ఉత్తమ CEO అని వెల్లడైంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications