Success Story: ప్రస్తుతం దేశంలో స్టార్టప్స్ కల్చర్ కొనసాగుతోంది. కొత్త ఆలోచనల నుంచి పుట్టిన ఈ వ్యాపారాలు కొన్ని సక్సెస్ అవుతుంటే.. మరికొన్ని కనుమరుగవుతున్నాయి. టాటాలు లాంటి అగ్ర వ్యాపారవేత్తలు సైతం యువ వ్యాపారవేత్తల ఆలోచనలకు సాయం చేస్తున్నారు.
ఆకలితో ఉన్నప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటి యాప్స్ ద్వారా క్షణాల్లో ఆహారాన్ని ఆర్డర్ చేసి.. కొన్ని నిమిషాల్లోనే ఇంటివద్దకు పొందే రోజులివి. అధితి, చేతన్ అనే భార్యాభర్తలకు అచ్చం ఇలాంటి వ్యాపార ఆలోచన వచ్చింది. ఎవరైనా తమ వాహనాలకు అవసరమైన పెట్రోల్ ఇంటి వద్దే డెలివరీ పొందేందుకు వీలు కల్పించేందుకు స్టార్టప్ కంపెనీని ప్రారంభించాలనుకున్నారు.

కొత్తతరం ఆలోచనతో వీరు పూణే కేంద్రంగా Repos Energyని ప్రారంభించారు. ఇది ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వారికి ఇంధనాన్ని నేరుగా ఇంటి వద్దకు డెలివరీ చేస్తుంది. అధితి తల్లిదండ్రులు ఆమె పెళ్లికోసం తగిన పెళ్లికొడుకును వెతకమని అడిగినప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ కాన్సెప్ట్ నుంచి ఈ ఆలోచన పుట్టింది. పెళ్లి తర్వాత స్టార్టప్ కంపెనీని ఏర్పాటు చేయాలని వారు భావించారు. అలా పెట్రోల్ బంకుల మాదిరిగానే లీటరుకు రూ.2.2 మార్జిన్ తో వ్యాపారాన్ని ప్రారంభించారు. మెుదట్లో నెలకు రూ.70 వేలను మార్జిన్ రూపంలో లాభాన్ని గడించారు.
వీరి వినూత్న ఆలోచన టాటాలను ఆకర్షించింది. దీంతో టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారు. వారి టెక్నాలజీ, ఎనర్జీ సోర్సెస్ నచ్చటంతో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత కంపెనీ రాకెట్ వేగంతో ముందుకు సాగటం మెుదలెట్టింది. గడచిన ఏడాదిలో వారు రూ.65 కోట్ల వ్యాపార టర్నోవర్ నమోదు చేశారు. ప్రస్తుతం కంపెనీ విలువ దాదాపు రూ.200 కోట్లుగా ఉంది. ప్రస్తుతం కంపెనీ Larsen & Toubro, Tata Group, Mahindra & Mahindra, Schindler, JW Marriott hotel, Phoenix Mall, The Westin Hotel, General Electrical వంటి దిగ్గజ కంపెనీలతో వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకుంది.


Click it and Unblock the Notifications