Success Story: దేశం ఎంత అభివృద్ధి చెందినప్పటికీ భారత మూలాలు వ్యవసాయంలోనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదులుకుంటున్నప్పటికీ.. రైతు రాజ్యం మళ్లీ తిరిగి వస్తుందని ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి నిరూపిస్తున్నారు.
ప్రస్తుతం చాలా మంది యువత తిరిగి వ్యవసాయం వైపు ఆసక్తి చూపుతూ ధనవంతులుగా మారుతున్నారు. దీనికోసం ఉద్యోగాలు వదిలేస్తున్నారు. కర్ణాటకకు చెందిన శశికుమార్, అతని స్నేహితులు ఐటీ ఉద్యోగాలు వదులుకుని సేంద్రియ వ్యవసాయం చేస్తూ మంచి రాబడులను అందుకుంటున్నారు. 17 ఏళ్లపాటు ఐటీ పరిశ్రమలో పనిచేసిన.. కేవలం విప్రోలో 13 ఏళ్ల పాటు టెక్కీగా గడిపారు. అప్పుడు వ్యవసాయంలో రైతులు పడుతున్న కష్టాలను చూశాడు. అలా 2010లో 23 మంది మిత్రులు కలిసి అక్షయకల్ప ఆర్గానిక్‌ని(Akshayakalpa organics) ప్రారంభించారు.

శశికుమార్ రైతులకు కొనుగోలు దారులకు మధ్య వారధిగా నిలిచి వారి ఆదాయాలను పెంచటంలో దోహదపడ్డారు. అలా మెుదట్లో పాల వ్యాపారాన్ని కేవలం ముగ్గురు రైతులతో వారు ప్రారంభించారు. అయితే అక్షయకల్ప ఆర్గానిక్ పాలతో ఆగకుండా.. ఆరోగ్యకరమైన ఆహారం పట్ల ఉన్న శ్రద్ధతో వారు సేంద్రీయ కూరగాయలు, పండ్లను పండించడం ప్రారంభించారు. బెంగళూరు, చెన్నై వంటి దేశంలోని పెద్ద నగరాల్లోని ప్రజలు కూడా ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగదారులకు చేరువయ్యారు. ఈ క్రమంలో రైతులకు సైతం అవసరమైన జ్ఞానాన్ని అందించటం ప్రారంభించారు.
మెుదట్లో లాభాలు రాకపోయినప్పటికీ ప్రయత్నాన్ని మాత్రం శశికుమార్ బృందం వదులుకోలేదు. అయితే రూ.10 కోట్లతో కొత్త డెయిరీ ప్లాంట్ ప్రారంభించటంతో వారి ప్రయాణంలో పెద్ద మలుపు వచ్చింది. రోజుకు లక్ష లీటర్ల ప్రాసెసింగ్ సామర్థ్యంతో 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ వ్యవస్థ విచ్ఛిన్నం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ స్టార్టప్ రూ.205 కోట్లను ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్షయకల్ప ఆర్గానిక్ ఆదాయం 25 శాతం పెరుగుతుందని శశి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కంపెనీ 5 వేల గ్రామాలు, 5 వేల మంది రైతులకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందని శశికుమార్ తెలిపారు.


Click it and Unblock the Notifications