Success Story: రూ.5 వేలు అప్పుతో వ్యాపారం.. ప్రస్తుతం రూ.46 వేల కోట్లకు అధిపతి, ఇదిరా సక్సెస్..

Hitesh Chimanlal Doshi Story: ధృడ సంకల్పం ఉంటే చాలు చేసే పని ఏదైనా, ఎంతటి చిన్నదైనా విజయం మాత్రం తప్పక వరిస్తుందని కొందరు వ్యాపారవేత్తలు నిరూపిస్తూనే ఉన్నారు. చిన్న మెుత్తం అప్పుచేసి వేల కోట్లకు పడగలెత్తిన రియల్ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇటీవలే దేశీయ స్టాక్ మార్కెట్లలో సంచలనాలు సృష్టించిన సోలార్ ప్యానల్స్ తయారీ సంస్థ వారీ ఎనర్జీ కంపెనీ యజమాని హితేష్ చిమన్‌లాల్ దోషి గురించే. దోషి ప్రస్తుతం వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఆయన కంపెనీని చాలా చిన్నగా ప్రారంభించారు. ముంబైలో చదువుతున్న సమయంలో బంధువు వద్ద రూ.5000 అప్పు చేసి వ్యాపారంలోకి అడుగుపెట్టారు. చదువుతున్న రోజుల్లో హార్డ్ వేర్, ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ చేసేవారు. అలా నెలకు రూ.1000 సంపాదిస్తూ ఆ డబ్బును కాలేజీ ఫీజులు, ఇతర ఖర్చులకు వినియోగించేవారు. దీని తర్వాత సెప్టెంబరు 1989లో వెంచర్‌ను వారీ ఇన్‌స్ట్రుమెంట్స్ పేరుతో ప్రారంభించారు. మెుదటి ఏడాది రూ.12 వేలు టర్నోవర్ సాధించాడు. అయితే వ్యాపారంలో 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత ప్రస్తుతం దోషి రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో అతిపెద్ద ఆటగాడిగా మారారు. ప్రస్తుతం వారీ మార్కెట్ క్యాప్ రూ.71,244 కోట్లకు చేరుకుంది.

Know success story of Waaree group founder Hitesh Chimanlal Doshi from rags to riches

ఇక హితేష్ చిన్నతనం గురించి పరిశీలిస్తే.. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించారు. అతని తండ్రి కిరాణా దుకాణం నడిపేవాడు. గ్రామంలో విద్యుత్, ఫోన్ వంటి సౌకర్యాలు కూడా అంతంతమాత్రంగానే ఉండేవి. అలా స్వగ్రామంలో 7వ తరగతి వరకు ఉండటంతో తర్వాతి చదువుల కోసం సైకిల్‌పై మరో గ్రామానికి వెళ్లేవారు. అలా ఇంటర్మీడియట్ పూర్తి చేశాక ముంబైలోని శ్రీ చినాయ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. ఆ సమయంలోనే కుటుంబంపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు సొంతంగా వ్యాపారాన్ని అప్పు చేసిన డబ్బుతో ప్రారంభించారు.

గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక దోషి బ్యాంక్ నుంచి రూ.1.5 లక్షలు రుణంగా తీసుకుని ప్రెజర్ గేజెస్, గ్యాస్ స్టేషన్ ఎక్విప్మెంట్, ఇండస్ట్రియల్ వాల్వ్స్ వంటి ఉత్పత్తుల తయారీని ప్రారంభించాడు. ఆ సమయంలోనే నీటి పంపులు, హీటర్ల తయారీని ప్రారంభించాడు. కుక్కర్లు, లాంతర్ల వంటి ఎలక్ట్రికల్ పరికరాల్లో వ్యాపారం చేసిన తర్వాత గ్రామంలోని వారీ దేవాలయం పేరు మీద కంపెనీకి వారీ ఎనర్జీస్ అని పేరు పెట్టాడు. ఈ క్రమంలో వారీ కంపెనీ అమెరికా, యూరప్ కస్టమర్ల నుంచి పెద్ద ఆర్డర్లు అందుకునేది. ఈ క్రమంలో 2007లో జర్మనీలో ఒక ఎగ్జిబిషన్ కు హాజరైన హితేష్ అక్కడ సోలార్ ఎనర్జీకి ఉన్న భవిష్యత్తు గురించి అర్థం చేసుకుని మంత్రముగ్ధులయ్యారు. ఆ సమయంలోనే థర్మల్ ఎక్విప్మెంట్ వ్యాపారం నుంచి సోలార్ సెల్స్ ఉత్పత్తిపై ఫోకస్ పెట్టడం ప్రారంభించారు.

ప్రస్తుతం వారీకి దేశీయంగా 20 శాతం మార్కెట్ వాటా ఉంది. ప్రస్తుతం దోషి కుటుంబం ప్రపంచ కుబేరుల జాబితాలో చోటుదక్కించుకుంది. ప్రస్తుతం దోషి ఆస్తి విలువ దాదాపు రూ.46 వేల కోట్లుగా ఉంది. ఇంజినీరింగ్ విభాగం వారీ రెన్యూవబుల్ టెక్నాలజీస్ లిమిటెడ్ అలాగే ఎనర్జీ స్టోరేజ్ కంపెనీ వారీ టెక్నాలజీస్ లిమిటెడ్‌ ఇప్పటికే దేశీయ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. వారీ ఎనర్జీస్ 12,000 మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద సోలార్ మాడ్యూల్ తయారీదారుగా కొనసాగుతోంది. భారతదేశంలోని తూర్పు తీరంలో ఉన్న ఒడిషాలో 6 GW తయారీ కర్మాగారాన్ని నిర్మించడానికి వారీ ఎనర్జీస్ ఇటీవల ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని వినియోగించాలని నిర్ణయించింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+