Success Story: అప్పుచేసి ఒక్క లారీ కొన్నాడు.. వేలకోట్లకు అధిపతయ్యాడు.. రియల్ సక్సెస్..
Vijay Sankeshwar: రాత్రికి రాత్రి కోటీశ్వరులు అనేక మాట ఇప్పుటి మార్కెట్లో కుదురుతుందేమో కానీ దశాబ్దాల కిందట అస్సలు కుదరని విషయం. నమ్ముకున్న వృత్తిపై దృష్టి పెట్టిన వారు నష్టపోయిన దాఖలాలు చాలా అరుదు.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది విజయ సంకేశ్వర్ సక్సెస్ గురించే. తన వ్యాపారాన్ని విజయవంతం చేయాలనే ఉద్ధేశ్యంతో లోన్ తీసుకుని ఒక ట్రక్కును కొనుగోలు చేశారు. అయితే ఒక్క ట్రక్కుతో పెద్ద వ్యాపారంగా ఎలా మారొచ్చనే విషయాన్ని నిజ జీవితంలో ఆయన నిరూపించి చూపారు. అయితే ఆయన ప్రయాణం ప్రస్తుతం ఏకంగా 5700 ట్రక్కులకు చేరుకుంది. కర్ణాటకలోని ధార్వాడ్‌కు చెందిన విజయ్ సంకేశ్వర్ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు.

ట్రక్కింగ్ కింగ్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుచుకునే విజయ్ సంగేశ్వర్ 1976లో తన సింగిల్ ట్రక్కుతో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. సంగేశ్వర్ కుటుంబం ప్రచురణ సంస్థను నడిపించేది. కానీ విజయ్ మాత్రం ట్రాన్స్ పోర్ట్ వ్యాపారంపై ఆసక్తితో ఇటు రావాలని ప్లాన్లను అతని కుటుంబం అంగీకరించలేదు. సొంతంగా వ్యాపారం చేయాలనే నిర్ణయాన్ని ఎవ్వరూ స్వాగతించలేదు. కానీ వీటన్నింటినీ దాటుకుని ఒక్క ట్రక్కుతో కలను సాకారం చేసుకునేందుకు వ్యతిరేతను పక్కన పెట్టి ముందుకు సాగారు. విజయ్ వార్తాపత్రికను తరువాతి కాలంలో టైమ్స్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేసింది.
విజయానంద్ ట్రావెల్స్ పేరుతో తొలుత రవాణా వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే తర్వాతి కాలంలో దాని పేరును VRL లాజిస్టిక్స్‌గా మార్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ గురించి దేశంలో పరిచయం అవసరం లేదు. ప్రాచుర్యం పొందిన సంస్థ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతోంది. దేశంలోని ఇతర పోటీదారులతో ఏమాత్రం తగ్గకుండా VRL లాజిస్టిక్స్ తెరపైకి వచ్చింది. కంపెనీ వివిధ కార్గో అవసరాల కోసం వేలాది ట్రక్కులు, మినీ ట్రక్కుల ఫ్లీట్ కలిగి ఉంది.
దీంతో దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరుగా విజయ్ సంకేశ్వర్ గుర్తింపును పొందారు. VRL లాజిస్టిక్స్ స్టాక్ గడచిన 5 ఏళ్లలో పెట్టుబడిదారులకు 115 శాతం రాబడిని అందించింది. అలాగే ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.6,142 కోట్లకు చేరుకుంది. పారిశ్రామిక రంగంలో విజయ్ సంకేశ్వర్ సాధించిన విజయాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది.


Click it and Unblock the Notifications