Vivek Chaand Sehgal: వ్యాపారంలో విజయం సాధించటం ఎంత కష్టమైన విషయమో మనందరికీ తెలిసింది. అయితే ఒక భారతీయుడు ఆస్ట్రేలియాలో కోటీశ్వరుడిగా సుపరిచిత వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వివేక్ చంద్ షేఖల్ గురించే. ప్రస్తుతం ఆయన 66 ఏళ్ల వయస్సులో మదర్‌సన్ గ్రూప్ ఛైర్మన్, సహ వ్యవస్థాపకుడిగా కొనసాగుతున్నారు. కంపెనీ ఆదాయం రూ.1,05,600 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ప్రస్తుతం వివేక్ చంద్ ఆస్ట్రేలియాలో నివసిస్తున్న అత్యంత సంపన్ను భారతీయుడిగా కొనసాగుతున్నారు.

వివేక్ వాస్తవానికి 1975లో వెండి వ్యాపారంలో నైపుణ్యం కలిగిన తన దివంగత తల్లి స్వరణ్ లతా షేఖల్‌తో కలిసి మదర్‌సన్ కంపెనీని స్థాపించారు. తల్లి-కొడుకు భాగస్వామ్యం అయినందున మదర్‌సన్ అనే పేరు ప్రసిద్ధి చెందింది. వివేక్ సంత్ షేఖల్ ఆటో విడిభాగాల తయారీలో నిమగ్నమైన మదర్‌సన్ గ్రూప్‌కు అనుబంధ సంస్థ అయిన సంవర్దన మదర్‌సన్ గ్రూప్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు. జనవరి 30, 2024 నాటికి వివేక్ చంద్ షేఖల్ నికర విలువ 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. మన కరెన్సీ లెక్కల ప్రకారం ఆయన నికర విలువ రూ.39,904 కోట్లుగా నిలవటంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో 602వ స్థానంలో నిలిచారు.
2021లో ఫోర్బ్స్ మ్యాగజైన్ భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 49వ స్థానంలో నిలిచారు. వివేక్ ప్రధాన సంపద సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, దీనిని గతంలో మదర్‌సన్ సుమీ అని పిలిచేవారు. దిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా ఉన్న వివేక్ ఆస్ట్రేలియా పౌరుడిగా ఉన్నారు. సుమిటోమో వైరింగ్ సిస్టమ్స్, మదర్‌సన్ గ్రూప్‌ల మధ్య జాయింట్ వెంచర్ అయిన మదర్‌సన్ సుమీ వైరింగ్ ఇండియాను స్థాపించారు.
భారతీయ వైరింగ్ పరిశ్రమలో కంపెనీ ఆధిపత్యం చెలాయిస్తోంది. BMW, ఫోర్డ్, మెర్సిడెస్, టయోటా, ఫోక్స్‌వ్యాగన్ వంటి ప్రఖ్యాత కంపెనీలకు తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. మదర్సన్ గ్రూప్ ఆటోమోటివ్ అండ్ రవాణా పరిశ్రమల కోసం విడిభాగాల తయారీలో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది.


Click it and Unblock the Notifications