Vishal Jindal: ప్రస్తుతం దేశంలో ఐఐటీ, ఐఐఎమ్ వంటి ప్రతిష్టాత్మకమైన కాలేజీల్లో చదువుకున్న వారు ఎక్కువగా సొంత వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఉద్యోగం వద్ద వ్యాపారమే ముద్దు అంటున్నారు.
అలా ఐఐటీ భువనేశ్వర్‌లో చదివిన విశాల్ జిందాల్ ఆ తర్వాత న్యూయార్క్‌లోని సిరక్యూస్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశాడు. అతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో ఫైనాన్స్ చదివాడు. ఆగ్రాకు చెందిన జిందాల్ ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్‌లో మంచి లాభాలు పొందుతున్నప్పుడు భిన్నమైన ఆలోచన తట్టింది. లోకల్ ఫుడ్‌ను నేషనల్ బ్రాండ్‌గా మార్చాలని తోచింది. వాస్తవానికి ఆగ్రాలోని ఫుడ్ మార్కెట్ సందర్శనతో ఇది మరింతగా దృఢపడింది. అలా 2015లో తన స్నేహితుడు కౌశిక్ రాయ్‌తో కలిసి బిర్యానీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈ క్రమంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు.

వ్యాపారం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన భారతదేశంలోని ఖాన్సామా సంప్రదాయాన్ని పునరుద్ధరించడం. ఇక్కడ ప్రతి ఆర్డర్ ఒక్కొక్కటిగా తయారు చేయబడుతుంది. బిర్యానీ మట్టి ప్లాట్‌లో ప్యాక్ చేయబడి, కాల్చిన పిండితో మూసివేయబడుతుంది. ప్రస్తుతం కంపెనీ నష్టాల్లో ఉంది. జూన్ 2023లో బ్రేక్ ఈవెన్ అవుతుందని ఆశిస్తున్నాడు. మెక్‌డొనాల్డ్స్, స్టార్‌బక్స్ కంటే పెద్ద వ్యాపార సంస్థగా దీనిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జిందాల్ పనిచేస్తున్నాడు.
గురుగ్రామ్, హర్యానా బిర్యానీ బై కిలో ఫుడ్ చైన్‌కు నిలయం. జిందాల్ స్థాపించిన బిర్యానీబై కిలో మంచి ప్రాచుర్యాన్ని పొందింది. విశాల్ జిందాల్ విమర్శలను పక్కన పెట్టి బిర్యానీ వ్యాపారాన్ని పాన్ ఇండియాకు ప్రాచుర్యం కల్పించడం కొనసాగించాడు. తండ్రి నుంచి గొప్ప మద్దతుతో బిర్యానీ బై కిలో డెలివరీ-ఆధారిత కంపెనీని నిర్మించాడు. ప్రస్తుతం కంపెనీ బిర్యానీలు, కబాబ్‌లతో పాటు మరిన్ని వంటకాలను విక్రయిస్తోంది. ఈ క్రమంలో నాణ్యమైన బాస్మతీ బియ్యాన్ని తయారీలో వినియోగించటం ప్రజలను ఆకర్షిస్తోంది.
దేశంలోని 45 కంటే ఎక్కువ నగరాల్లో బిర్యానీ బై కిలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో బిర్యానీ బై కిలో ఆదాయం రూ.221.75 కోట్లుగా ఉంటుందని ఫోర్బ్స్ ఇండియా లెక్కగట్టింది. రానున్న రెండు మూడేళ్లలో కంపెనీ వ్యాపారాన్ని రూ.1,000 కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో విశాల్ జిందాల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియా తర్వాత విదేశాలకు తన కంపెనీని విస్తరింపచేయాలని విశాల్ ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications