Virani Brothers: సక్సెస్ సాధించటం అంటే కేవలం డబ్బు సంపాదించటం మాత్రమే కాదు. దేశంలో అత్యుత్తమ కంపెనీల్లో ఒకటిగా నిలిచే స్థాయికి తన కలలను నిర్మించటం అని కొందరి సక్సెస్ స్టోరీ నిరూపిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్నాక్ వ్యాపారంలో దిగ్గజ కంపెనీని నిర్మించిన విరానీ సోదరుల గురించే. ఒకప్పుడు వందల రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించిన వీరు ప్రస్తుతం అత్యంత ప్రజాధరణ పొందిన బాలాజీ వేఫర్స్ సంస్థను స్థాపించటంతో పాటు విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్నారు. సందుభాయ్ విరానీ 1974లో తన సోదరుడితో కలిసి ఉద్యోగం కోసం రాజ్‌కోట్‌కు వచ్చారు. ఆ సమయంలో వారు సినిమా థియేటర్లలో స్నాక్స్ అమ్మే పనిలో చేరారు. అప్పుడు వారి నెల జీతం రూ.1000. సవాళ్ల ప్రయాణం తర్వాత రిస్క్ తీసుకుని సొంత వ్యాపారాన్ని ప్రారంభించే దిశగా వారు అడుగులువేశారు.

తాము సినిమా హాళ్లలో విక్రయించిన పొటాటో చిప్స్ భారీగా ప్రజాధరణ పొందటంతో దానిని పూర్తి స్థాయిలో చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ చిన్న ప్రయత్నం నేడు విరానీ సోదరులను దేశంలో అతిపెద్ద స్నాక్స్ తయారీ కంపెనీ నిర్మాణం దాకా నడిపించింది. తొలుత చిన్న స్థాయిలో చిప్స్ తయారీ చేసిన వీరు చుట్టుపక్కల దుకాణాల్లో వాటిని విక్రయించారు. అలా తర్వాతి కాలంలో 1982లో రూ.1.5 లక్షల రుణం తీసుకుని బంగాళదుంప చిప్స్ తయారీకి తొలిసారిగా ఫ్యాక్టరీని స్థాపించారు. అయితే ఆ రోజుల్లో ఇంత భారీ పెట్టుబడితో ఫ్యాక్టరీ ఏర్పాటు నిర్ణయం పెద్ద సాహసమనే చెప్పుకోవాలి. అలా 1992లో సోదరులు కలిసి బాలాజీ వేఫర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రత్యేక కంపెనీని స్థాపించారు.
బాలాజీ వేఫర్స్ దేశంలో మూడవ అతిపెద్ద స్నాక్ తయారీ కంపెనీ. భారతీయ స్నాక్స్ మార్కెట్‌లో కంపెనీకి ఏకంగా 12% మార్కెట్ వాటా ఉంది. ఒకానొక సమయంలో దీనిని అమెరికాకు చెందిన ప్రముఖ స్నాక్స్ తయారీదారు లేస్ తయారీ సంస్థ పెప్సికో కొనుగోలుకు ప్రయత్నాలు సైతం చేసింది. గడచిన ఏడాది కంపెనీ ఆదాయం రూ.5,000 కోట్ల మార్కుకు చేరుకుంది. ప్రస్తుతం 7000 మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ గంటకు 3,400 కిలోగ్రాముల చిప్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో 65 కంటే ఎక్కువ స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. కంపెనీకి ఉన్న అద్భుతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్, నాణ్యమైన ఉత్పత్తి కారణంగా దేశంలోని మారుమూల గ్రామాల్లో సైతం కంపెనీ తన ఉత్పత్తులను విక్రయిస్తోంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications