Saffron Farming Success: మనసులో సాధించాలి అనే కోరిక ఉంటే మనిషి ఎంత దూరం అయినా వేళతారు అనటానికి ఇదొక చక్కటి ఉదాహరణ. నేటి గాలంలో యువత రెగ్యులర్ జాబ్స్ మానేసి తమకు నచ్చిన పనిలో ఫుల్ ఫోకస్ పెడుతున్నారు. దాని ఫలితం జీతం కంటే వేల రెట్లు లాభాలను తెచ్చిపెడుతోంది. చిన్న స్థలంలో లక్షలు సాగుతో సంపాదించటం గురించి ఈ ఇద్దరు అన్నదమ్ముల సక్సెస్ స్టోరీ చూసి అందరం నేర్చుకోవచ్చు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నవీన్, ప్రవీణ్ సింధు అనే ఇద్దరు సోదరుల సక్సెస్ స్టోరీ గురించే. వారు తమ ఇంట్లోని చిన్న గదిలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా అయిన కుంకుమ పువ్వును పెంచి లక్షలు సంపాదిస్తున్నారు. వాస్తవానికి కుంకుమపువ్వుతో ఆరోగ్యానికి లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని అనేక చర్మ సౌందర్య ఉత్పత్తుల తయారీ నుంచి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం వరకు అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. గుండె ఆరోగ్యం, కంటి ఆరోగ్యం, మానసిక స్థితి మెరుగుదల, బరువు తగ్గడం మొదలైన ఔషధ గుణాలను కుంకుమపువ్వు కలిగి ఉంది.

దీనికి మార్కెట్లో ఉన్న డిమాండ్ తో పాటు ఆరోగ్య ప్రయోజనాలను వ్యాపార ఆలోచనగా మలచుకోవాలని ఎంటెక్ పూర్తి చేసిన ప్రవీణ్, హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ నవీన్ నిర్ణయించుకున్నారు. దీంతో వాళ్లు సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా తమ ఇంటిలోని 225 చదరపు అడుగుల గదిలో ఆధునిక పద్ధతిని వినియోగించి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో అధికారిక శిక్షణ పొందిన తర్వాత కశ్మీర్ నుంచి 100 కేజీల విత్తనాలను కొనుక్కొచ్చారు. అలా కేవలం 13 లక్షల పెట్టుబడితో తమ ఇంటిపైనే సాగుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
కుంకుమపువ్వు పెరగడానికి 10-20 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. అయితే ఈ అన్నదమ్ములు సూర్యరశ్మికి బదులు ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించి కృత్రిమంగా ఏర్పాటు చేసిన వాతావరణంలో వ్యవసాయం చేశారు. ఇందుకోసం వాళ్లు ఏరోపోనిక్ టెక్నాలజీని ఉపయోగించి కొన్ని నెలల్లోనే 1.5 కిలోల కుంకుమపువ్వును ఉత్పత్తి చేశారు. దీనిని ల్యాబ్ లో పండించిన అధిక నాణ్యత కలిగిన కుంకుమపువ్వుగా చెప్పి కేజీని రూ.5 లక్షలకు అమ్మటం స్టార్ట్ చేశారు. వాస్తవానికి భూమిపై న్యాచురల్‌గా పండించిన కుంకుమపువ్వుకు కేజీ ధర దాదాపు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. మార్కెట్లో ప్రజలు ప్రీమియం కుంకుమపువ్వు కొనుగోలుకు ఆసక్తి చూపటంతో వీరిద్దరి పంట పండింది.
సోదరులు కలిసి అమర్త్వ ఆగ్రో అనే పేరుతో తమ సొంత కుంకుమపువ్వు బ్రాండ్‌ను కూడా లాంచ్ చేశారు. ఆధునిక పద్ధతుల్లో చిన్న గదిలో పండించిన ఈ కుంకుమపువ్వును ప్రస్తుతం వారు అమెరికాతో పాటు యూకే వంటి అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేస్తున్నారు. పెద్ద కలలు నెరవేర్చుకోవటానికి చిన్న స్థలం ఉంటే సరిపోతుందని ఈ సోదరులు తమ తాజా విజయంతో నిరూపించారు.
More From GoodReturns

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications