Success Story: రూ.5 లక్షల కోట్ల వ్యాపారానికి అధినేత.. ముఖేష్ అంబానీకి పోటీదారు.. సక్సెస్
Success Story: ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు, అనేక రంగాల్లో భారతీయులు విజయవంతంగా ముందుకు సాగుతున్నారు. అనేక అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను ముందుకు నడిపిస్తున్నారు కూడా.
ముఖేష్ అంబానీ, నారాయణమూర్తి, రతన్ టాటా, కుమార మంగళం బిర్లా ఇలా చెప్పుకుంటూపోతే చాలా మందే విజయవంతమైన వ్యాపారవేత్తలు దేశంలో ఉన్నారు. అయితే టెలికాం రంగంలో ఒకరి పేరు మాత్రం విజయం సాధించిన వారిలో ప్రధానమైనది. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది టెలికాం బిలియనీర్ సునీల్ మిట్టల్ గురించి. ఎన్ని కంపెనీలు వచ్చినా భారతీ ఎయిర్ టెల్ మాత్రం టాప్ మొబైల్ ఫోన్ ప్రొవైడర్గా ముందుకు సాగుతూనే ఉంది. ఆయన సంస్థకు అంబానీ స్థాపించిన రిలయన్స్ జియో, బిర్లాలకు చెందిన వోడఫోన్ ఐడియాలు పోటీదారులుగా కొనసాగుతున్నాయి.

అసలు సునీల్ మిట్టల్ పంజాబ్‌లోని లూథియానాకు చెందిన వ్యక్తి. పంజాబ్ యూనివర్శిటీ నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ బ్యాచిలర్స్ పూర్తి చేశారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ ను సునీల్ అందుకున్నారు. మరణించిన ఆయన తండ్రి సత్ పాల్ మిట్టల్ రాజ్యసభలో ప్రతినిధిగా వ్యవహరించారు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం సునీల్ మిట్టల్ నికర విలువ 6.8 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే మన కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు రూ.56,000 కోట్లు. ఫోర్బ్స్ 2022 సంపన్న భారతీయుల జాబితాలో మిట్టల్ 11వ స్థానంలో నిలిచారు.
ఈ పారిశ్రామికవేత్తకు టెలికాం, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, విద్యతో సహా అనేక రకాల ఆసక్తులను కలిగి ఉన్నాడు. మిట్టల్ 17 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన భారతి ఎయిర్‌టెల్‌కు ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. 18 ఏళ్ల వయస్సులో ఏప్రిల్ 1976న తండ్రి వద్ద రూ.20,000 అప్పు తీసుకుని మెుదటగా సైకిల్ విడిభాగాల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించారు. అలా తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఎయిర్‌టెల్ కంపెనీని గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దారు. అలా 15 ఆఫ్రికన్ దేశాల్లో జైన్ టెలికాం BV కార్యకలాపాలను Airtel గ్రూప్ 10.7 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయటంతో ఎయిర్‌టెల్ ఆఫ్రికా పుట్టింది.


Click it and Unblock the Notifications