Banswada Mahipal Reddy: వ్యవసాయంలో కోట్లు సంపాదించటం అనేది ఊహించటానికి ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. పంటలు పండించటంలో కొన్ని కిటుకులు తెలుసుకుంటే కోట్లు సంపాదించొచ్చని ఒక రైతు నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది టమాటా పంటతో కోట్లు గడించిన తెలంగాణలోని మెదక్ రైతు బాన్సువాడ మహిపాల్‌రెడ్డి సక్సెస్ స్టోరీ గురించే. గత ఏడాది ఆయన టమాటాలు అమ్మి కోట్లకు పడగలెత్తటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మార్కెట్‌లో కొరత ఏర్పడినప్పుడు పంట చేతికి వచ్చే విధంగా టమోటా సాగు చేయడమే తన సక్సెస్ ఫార్ములా రెసిపీ అని రెడ్డి చెబుతున్నారు. ఇందుకోసం తాను పంటను ఏప్రిల్-మే నెలల మధ్యలో నాటతానని పేర్కొన్నారు. ఈ పంట జూన్-ఆగస్టు మధ్య చేతికి అందుతుందని చెప్పారు.

వాస్తవానికి జూన్, జూలై నెలల్లో కూరగాయల సరఫరా మార్కెట్లలోకి తక్కువగా ఉంటుందని, అందువల్ల ఆ సమయంలో పండించే పంటకు మంచి ధరలు ఉంటాయని రెడ్డి వెల్లడించారు. గత ఏడాది టమాటా ధరలు ఏకంగా కేజీ రూ.200 తాకిన సమయంలో 8 ఎకరాల పంటను సాగుచేసిన రెడ్డి ఈ ఏడాది దానిని 30 ఎకరాలకు విస్తరించినట్లు పేర్కొన్నారు. వేసవిలో టమోటా పంటలు పండించడంలో రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ, ఏప్రిల్ మే మధ్య అత్యంత వేడి గాలులు, అధిక ఉష్ణోగ్రతల నుంచి పంటను కాపాడేందుకు నీరు, ఎరువులు ఇవ్వడంతో పాటు ఉద్యానవన శాఖ అధికారుల సూచనలను అనుసరించాలని పేర్కొన్నారు.
వేసవిలో విత్తనాల నుంచి కోతల వరకు మెుత్తం ఖర్చులను పరిగణిస్తే ఎకరాకు రూ.3 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని చెప్పారు. అదే చలికాలంలో ఇది రూ.2 లక్షలుగా ఉంటుందన్నారు. ఇక్కడ ఎండాకాలంలో నాటిన పంట తర్వాత వచ్చే వానాలను తట్టుకునేలా చూసుకోవాలని చెప్పారు. లేకపోతే పూత రాలిపోతుందని అన్నారు.
ఇదిలా ఉండగా మహిపాల్ రెడ్డి ఈ ఏడాది 30 ఎకరాల్లో టమాటా పంటను విజయవంతంగా సాగు చేశారు. రిటైల్ మార్కెట్‌లో ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో దిగుబడి రావడం ప్రారంభించింది. ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధర రూ.80 నుంచి రూ.100 మధ్య పలుకుతున్న వేళ హోల్ సేల్ మార్కెట్లలో సైతం మంచి ధరలు పలుకుతున్నట్లు రైతు తన సక్సెస్ స్టోరీని వెల్లడించారు. టమాటా పంట ఇతర పంటల మాదిరిగా కాకుండా 70 నుంచి 90 రోజుల మధ్య మంచి దిగుబడిని అందిస్తుందని మహిపాల్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుత ఏడాది సైతం రేట్లు అధికంగా ఉన్నందున మంచి ఆదాయం వస్తుందని ఆయన ఆశాజనకంగా ఉన్నారు.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications