Success Story: 75 సార్లు ఓటమి.. పట్టువదలక రూ.6,700 కంపెనీ నిర్మించిన తెలంగాణ బిడ్డ..
Telangana News: నేటి తరం యువత వేగంగా విజయాలను రుచి చూస్తున్నారు. గతంలో ఒక వ్యాపారవేత్తగా ఎదగాలంటే కనీసం దశాబ్ధకాలం పట్టేది. అయితే మారుతున్న సాంకేతికతలు, ప్రజల అవసరాల నుంచి ఉద్భవిస్తున్న వ్యాపారాలు అనతికాలంలోనే పెద్ద విజయాలను సాధిస్తూ అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది తెలంగాణకు చెందిన పవన్ గుంటుపల్లి సక్సెస్ స్టోరీ గురించే. పవన్ విజయం వెనుక పట్టుదల, సంకల్పం, వ్యవస్థాపక స్ఫూర్తి ఉన్నాయి. చిన్న వయస్సులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ ట్రేడింగ్ నేర్చుకున్నాడు. ఐఐటి ఖరగ్‌పూర్‌లో ఉన్నత చదువుల సమయంలో భవిష్యత్తు కోసం నైపుణ్యాలను పెంచుకున్నాడు. అలా సామ్‌సంగ్ కంపెనీలో కొంతకాలం పనిచేసిన తర్వాత పవన్ తన మిత్రుడు అరవింద్ సంకా మినీట్రక్కుల వినియోగం ద్వారా ఇంటర్‌సిటీ లాజిస్టిక్స్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన "ది కారియర్" అనే కంపెనీని ప్రారంభించారు. అలా వారి వ్యాపార ప్రయాణం మెుదలైంది.

అయితే 2014లో రాపిడో పేరుతో ప్రారంభించిన బైక్ టాక్సీ సర్వీస్ వ్యాపారం మెుదట్లో అనేక ఎదురుదెబ్బలు తింది. అయితే వీటితో కుంగిపోని పవన్ బృందం ముందుకే సాగింది. తమ ఆలోచనకు ఫండింగ్ కోసం చేసిన ప్రయత్నాలు దాదాపు 75 మంది పెట్టుబడిదారుల నుంచి తిరస్కరణకు గురైంది. మార్కెట్లో పెద్ద ఆటగాళ్లతో రాపిడో పోటీపడటం అసాధ్యంగా ఇన్వెస్టర్లు భావిచటంతో పెట్టుబడి పెట్టేందుకు నిరాకరించారు. రైడ్ హెయిలింగ్ వ్యాపారంలో ఓలా, ఉబెర్ నియంత్రణలో ఉన్న మార్కెట్లో ఉబెర్ బతకలేదని ఇన్వెస్టర్లు అభిప్రాయపడ్డారు.
అయితే వీటన్నింటినీ పక్కనపెట్టి పవన్ పట్టుదలతో తన ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే ఈ ప్రయాణంలో రాపిడో ప్రారంభించిన తర్వాత కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. కానీ 2016లో హీరో మోటోకార్ప్ ఛైర్మన్, ఎండీ పవన్ ముంజాల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో కంపెనీ దేశంలో 100 నగరాలకు వేగంగా విస్తరించింది. రాపిడో ప్రయాణంలో ఈ కీలక మలుపు కంపెనీ గమనాన్ని వేగాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం రాపిడో దేశవ్యాప్తంగా 50,000 మంది కెప్టెన్లతో పాటు 7 లక్షల మంది వినియోగదారులను కలిగి ఉంది. అలాగే ప్రస్తుతం కంపెనీ విలువ రూ.6,700 కోట్లుగా అంచనా వేయబడింది. ఆ తర్వాత స్విగ్గీ వంటి పరిశ్రమల ప్రముఖుల నుంచి వచ్చిన వ్యూహాత్మక పెట్టుబడులు Rapido వృద్ధిని పెంచాయి.


Click it and Unblock the Notifications