Success Story: రూ.2000తో ప్రారంభమైన రూ.125 కోట్ల కంపెనీ, బామ్మగారు 32 దేశాల్లో వ్యాపారం..
Sweet Karam Coffee Success: వ్యాపారం చేయాలనే కుతూహలం ఉండాలే గానీ దానిని ఎవ్వరూ ఆపలేరు. చాలా మంది ఆరు పదుల వయస్సులో తమ ఆలోచనలను ఆచరణ రూపంలోకి తీసుకొచ్చి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా మంది తమ అభిరుచులకు అనుగుణంగా బిజినెస్ స్టార్ట్ చేస్తూ విజయం సాధిస్తున్నారు. పెట్టుబడి పెద్దదా చిన్నదా అని కాదు ఆలోచన ఎంత పెద్దదన్నదాన్ని బట్టి విజయం ఉంటుందని ఒక బామ్మ నిరూపించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది స్వీట్ కారం కాఫీ సక్సెస్ స్టోరీ గురించే. దీనిని 2015లో ఆనంద్ భరత్వాజ్, నళిని పార్థిబన్ జంట ప్రారంభించారు. దీనికోసం వారు తమ ఉద్యోగాలను వదులుకున్నారు. వాస్తవానికి 82 ఏళ్ల బామ్మగారు జానకి పాటి ఈ ప్రయాణానికి వెనుక ప్రేరణగా నిలిచారు. ఈ క్రమంలో వారు కేవలం రూ.2000 పెట్టుబడితో చిన్న కిచెన్ లో స్వీట్ కారం కాఫీని ప్రారంభించారు. దక్షిణాది ప్రాంతాలకు చెందిన స్నాక్స్ మురుకు, జాంగ్రి, మైసూర్ పాక్ వంటి పదార్థాలను ప్రపంచానికి పరిచయం చేయాలని వారు నిర్ణయించుకున్నారు. అలా చిన్నగా ప్రారంభమైన వీరి ప్రయాణం ప్రజాధరణను పొందటంతో ప్రస్తుతం దేశంలోని అనేక కార్పొరేట్ కంపెనీలకు సరఫరా చేసే స్థాయిలకు పెరిగింది.

నిరంతరమైన పరిశ్రమతో ముందుకు సాగటంతో ప్రస్తుతం స్వీట్ కార్ కాఫీ వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా 32 దేశాలకు విస్తరించింది. దీంతో కంపెనీ విలువ రూ.125 కోట్లకు చేరుకుంది. ఈ ప్రయాణంలో భాగంగా 2023లో సంస్థ రూ.12.5 కోట్లను సమీకరించింది. దీనిని కొత్త మార్కెట్లలోకి విస్తరించటానికి స్వీట్ కారం కాఫీ వినియోగించింది. అలాగే ఆహార ప్రియులకు మరిన్ని స్నాక్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకురావటానికి పెట్టుబడిని వారు వినియోగించారు. అయితే వీరు తయారు చేస్తున్న అన్ని వంటకాలు బామ్మగారు అందించిన పాతకాలం రెసిప్పీలు కావటం గమనార్హం. ప్రేమ-శ్రద్ధతో చేసిన ఈ స్నాక్స్ బ్రాండ్ పేరును ముందుకు తీసుకెళుతున్నారు.
తొలినాళ్లలో కస్టమర్లను పొందటానికి వీరు స్వయంగా వార్తాపత్రిక కరపత్రాలను పంపిణీ చేశారు. కుటుంబంలోని హోమ్ చెఫ్‌లతో ప్రారంభించిన వ్యాపారంలో పార్థిబన్ మొదటి రోజుల్లో డోర్ డెలివరీలతో పెద్ద కుటుంబం వెన్నుగా నిలిచింది. ప్రస్తుతం కెనడా, అమెరికా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని భారతీయులు కంపెనీ ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ వార్షిక ఆదాయం రూ.8.5 కోట్లుగా ఉంది. కరోనా తర్వాత ప్రజల్లో ఇంటి ఆహారం, పరిశుభ్రమేన ఆహారానికి ప్రాముఖ్యత పెరిగిన వేళ తమ వ్యాపారం రెండింతలు పెరిగినట్లు పార్థిబన్ వెల్లడించారు. కంపెనీ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో చాలా మంది మహిళలు తమ రోజువారీ ఉద్యోగాలను విడిచి, వారి స్వంత సిబ్బందితో పూర్తి స్థాయి క్లౌడ్ కిచెన్‌లను ఏర్పాటు చేశారని పార్థిబన్ చెప్పారు.

కంపెనీ తొలిసారిగా చెన్నై, బెంగళూరు నగరాల్లో తన రిటైల్ దుకాణాలను ప్రారంభించింది. అలాగే స్వీట్ కారం కాఫీ తన ఉత్పత్తులను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‍లో విక్రయాలను కొనసాగిస్తోంది. దీనికి తోడు కంపెనీ తన సొంత వెబ్‌సైట్, యాప్ ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది. కంపెనీ ప్రత్యేకత ఏమిటంటే ప్రీమియం క్వాలిటీ ఉత్పత్తుల కోసం ఎట్టిపరిస్థితుల్లోనూ పామాయిల్ వినియోగించబోమని పేర్కొంది.


Click it and Unblock the Notifications