Success Story: రూ.12,000 కోట్లు సంపాదించిన బ్రదర్స్..! దేశమంతా విస్తరించిన వ్యాపార సక్సెస్

Suguna Chicken: సక్సెస్ కేవలం పెద్ద కలలుకనే ధైర్యం ఉన్న వారినే వరిస్తాయి. వారిలో ఉండే నిబద్ధత, చేస్తున్న పనిపై ప్రేమ వారిని ఊహించి స్థాయి కంటే పెద్ద విజయాల వైపుకు నడిపిస్తాయి. ఇదే విషయాన్ని తమిళనాడుకు చెందిన ఇద్దరు సోదరులు నిరూపించారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సౌందరరాజన్, సుందరరాజన్ సోదరుల గురించే. 1984లో కేవలం రూ.5000 చిన్న పెట్టుబడితో వీళ్లు ప్రారంభించిన కోళ్ల ఫారం వ్యాపారం పౌల్టీ రంగంలో పెద్ద కంపెనీగా అవతరించింది. తమిళనాడు కోయంబత్తూరుకు 72 కిలోమీటర్ల దూరంలోని ఉడుమలైపేటలో వారు తమ పౌల్ట్రీఫామ్ వ్యాపారాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో సుగుణా చికెన్ పేరుతో చేస్తున్న వారి వ్యాపారం దేశంలోని అగ్రగామి సంస్థగా ఎదిగింది. కంపెనీ ద్వారా వారు రూ.12,000 కోట్లను ఆర్జించారు.

Know success story of suguna chicken started with 5000 by Soundararajan, Sundararajan

ప్రస్తుతం సుగుణా ఫుడ్స్ 18 రాష్ట్రాల్లో దాదాపు 40,000 మంది రైతులతో కలిసి పనిచేస్తోంది. కంపెనీ ఛైర్మన్ గా సౌందరరాజన్ ఉండగా.. ఆయన కుమారుడు విఘ్నేష్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. కంపెనీ తూర్పు-దక్షిణాది ప్రాంతాల నుంచి ఎక్కువగా వ్యాపార ఆదాయాన్ని పొందుతోంది. ఈ ప్రాంతాల్లో బ్రాయిలర్ చికెన్, గుడ్లు ఉత్పత్తిలో కంపెనీ అగ్రగామిగా కొనసాగుతోంది. కాంట్రాక్ట్ పద్ధతిని ప్రవేశించి 1990లో కేవలం ముగ్గురు రైతులతో ప్రారంభించారు. ఇందులో రైతులు కోళ్లను పెంచగా పూర్తిగా పెట్టుబడిని కంపెనీ అందిస్తుంది. రైతులకు అన్ని విధాల సహాయ సహకారం కంపెనీ నుంచి అందుతుంది. ఏడేళ్లలో 40 మంది రైతులు చేరగా వారి ఆదాయం ఏడాదికి రూ.7 కోట్లకు చేరుకుంది.

పాఠశాల విద్య పూర్తయిన తర్వాత సౌందరరాజన్ కూరగాయలు పండించి వాటిని అమ్మేవాడు. పెద్దగా లాభాలు రాకపోవటంతో హైదరాబాద్‌లోని వ్యవసాయ పంపుల కంపెనీలో పనికి చేరారు. సాంకేతికత వినియోగంతో సుగుణా చికెన్ రైతులకు ఆరోగ్యకరమైన కోళ్లను పెంచటంలో సహాయపడింది. అలా కంపెనీ తమిళనాడు వ్యాప్తంగా తక్కువ కాలంలోనే పేరును సంపాదించుకుంది. చదువుకున్నది తక్కువే అయినా వ్యాపారంలో విశేష అనుభవంతో 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.3588.89 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అలాగే గత ఏడాది కంపెనీ వ్యాపార ఆదాయం రూ.12,000 కోట్లుగా నిలిచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+