Devaseva Success: మనం చూసే ఎక్కువ స్టార్టప్ స్టోరీలు లేదా సక్సెస్ స్టోరీలు ఇతర రాష్ట్రాలు లేదా నగరాలకు చెందిన వ్యక్తులకు సంబంధించి ఎక్కువగా ఉంటుంటాయి. అయితే నేడు మనం తెలుగు యువకులు ప్రారంభించిన సూపర్ సక్సెస్‌ఫుల్ స్టార్టప్ గురించి తెలుసుకుందాం.
ఫెయిత్ టెక్ అంటే ఆధ్యాత్మిక రంగంలో టెక్నాలజీని వినియోగించి ప్రజలకు అవసరమైన వివిధ సేవలను అందించే వ్యాపారంలో కంపెనీ నిమగ్నమై ఉంది. దేశంలోని 80 కోట్ల మంది హిందూ భక్తులకు సేవలను అందించటంలో భాగంగా మారే ఉద్ధేశ్యంతో దేవసేవను సందీప్, అనిల్ సహవ్యవస్థాపకులుగా ఉన్నారు. అలాగే ఆయన డొనేట్ కార్ట్ అనే మరో వెబ్‌సైట్ మెుదట వీరు ప్రారంభించారు. 2016లో ఎన్ఐటీ నాగపూర్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.

2021లో ప్రారంభమైన దేవసేవ ఏడాదిలోపై దాదాపు లక్ష మందికి పైగా కస్టమర్లను ఆన్ బోర్డ్ చేసుకుంది. ఈ సంస్థ భక్తులు నేరుగా పాల్గొనలేని ప్రత్యేక పూజలు, హోమాలు, అర్చన వంటి కార్యక్రమాలను చేరువ చేసింది. దేవసేవ ద్వారా మనం సదరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వామిగా మారవచ్చు. అక్కడ మన పేరుపై జరిగే పూజలు, హోమాలను సంస్థ లైవ్ స్టీమింగ్ రూపంలో నేరుగా చూసేందుకు, సుదూర ప్రాంతాల నుంచి పాల్గొనేందుకు నమ్మకమైన భాగస్వామిగా వ్యవహరిస్తూ భక్తులను భగవంతును కార్యక్రమాలకు చేరువ చేస్తోంది. ఆధునిక కాలంలో ఉన్న బిజీ వర్క్ షెడ్యూల్ వల్ల నేరుగా ప్రయాణం చేసి పూజాది కార్యక్రమాల్లో పాల్గొనలేక పోతున్న అనేక మందికి ఇది పెద్ద ఉపయోగకరంగా మారింది.
అలాగే డొనేట్ కార్ట్ దేశంలో ఉన్న వివిధ సేవా సంస్థలకు అవసరమైన వస్తువులను అందించేందుకు ఫండ్స్ రైజ్ చేస్తుంది. డబ్బుల రూపంలో కాకుండా సదరు సంస్థకు అవసరమైన వివిధ వస్తువులను డొనేట్ చేయటం ద్వారా ట్రాన్పరెన్సీని పెంచుతూ ముందుకు సాగుతోంది. ఏడాది కిందటి కాలానికి కంపెనీ దాదాపు రూ.150 కోట్లకు పైగా విలువైన వస్తువులను సేవా సంస్థలకు అందించటంలో సహాయకారిగా నిలిచింది. ప్రధానంగా కరోనా కాలంలో దాదాపు రూ.100 కోట్లు విలువైన వస్తువులను అవసరమైన ప్రజలకు అందించటంలో డొనేట్ కార్ట్ కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో వారు 500 సేవా సంస్థలతో కలిసి పనిచేశారు.
రానున్న కాలంలో కంపెనీ మెుత్తంగా 2 కోట్ల మందికి దేవసేవ ద్వారా సేవలు అందించాలని చూస్తోంది. ప్రస్తుతం ఈ స్టార్టప్ కంపెనీ విలువ దాదాపు రూ.100 కోట్లుగా ఉంది. కంపెనీ రానున్న కాలంలో ఒక యూనీకార్స్ అంటే రూ.8000 కోట్లు విలువైన సంస్థగా మారాలని చూస్తోంది.


Click it and Unblock the Notifications