Success Story: వ్యాపారం కోసం ఆఖరి ప్రయత్నం ఆకాశానికి చేర్చింది.. తెలుసుకోవాల్సిన స్టోరీ..

Ather Scooters: రాబోతున్నది ఎలక్ట్రిక్ వాహనాల యుగం. దీనిని అందిపుచ్చుకునేందుకు దశాబ్ధానికి పైగానే చాలా మంది తమ ప్రయత్నాలను ప్రారంభించారు. అయితే ఆలోచనను నమ్మి ఫండింగ్ చేసేవారు కొరవడ్డా విజయవంతమైన కంపెనీ స్టోరీ చూడండి..

ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కంపెనీ వ్యవస్థాపకులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ సక్సెస్ గురించే. వీరిద్దరూ ఐఐటీ మద్రాస్ నుంచి విద్యను పూర్తి చేశారు. వీరు వాహన రంగంలోని కంపెనీల్లో చదువు పూర్తయ్యాక పనిచేసిన అనుభవంతో ఈవీ రంగంవైపుకు మళ్లారు. అలా 2013లో తమ వ్యాపార ప్రయాణాన్ని మెుదలు పెట్టారు.

Know success story of smart EV scooters maker Ather funded by sachin bansal in hard times

వీరు భారత మార్కెట్లకు అనుగుణంగా ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి విక్రయించాలనే ఆలోచనతో ముందుకు సాగారు. అలా అత్యుత్తమ పనితీరు, జీరో మెయింటెనెన్స్, స్మార్ట్ స్కూటర్లను తయారు చేయటంపై శ్రద్ధ పెట్టారు. అలా 2018లో ఏథర్ 450ని మార్కెట్లోకి మెుదటగా విడుదల చేశారు. ఆ తర్వాత అప్ గ్రేజెడ్ వర్షెన్స్ విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈవీ కంపెనీ బెంగళూరు కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. అయితే వీరి ప్రయత్నాలు మాత్రం 2009 నుంచే ఈ రంగంపై ప్రారంభమయ్యాయి.

2014లో కంపెనీ ఐఐటీ మద్రాస్‌లోని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కింద టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డ్ నుంచి రూ.45 లక్షలు ఫండింగ్ అందుకుంది. అయితే స్టార్టప్ దశలో ద్వితీయార్థంలో నిధుల కొరత ఏర్పడింది. ఈ క్రమంలో కంపెనీ నిధుల కోసం చేసిన అనేక ప్రయత్నాలు తిరస్కరణకు గురయ్యాయి. తొలుత వీరు ఏథర్-S340 నిర్మాణంపై పనిచేశారు. ఆ సమయంలో ఫిప్‌కార్ట్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్‌కు ఒక మెయిల్ పంపారు. తమ స్టార్టప్ కలను బతికించుకునేందుకు రూ.30 లక్షల పెట్టుబడిని కోరారు. ఆ సమయంలోనే భారత ఈవీ అమ్మకాలు లక్ష యూనిట్ల నుంచి 15 వేల యూనిట్లకు పడిపోయాయి.

అయితే సచిన్ బన్సల్ నుంచి వారికి ఊహించని జవాబు వచ్చింది. ఫిప్ కార్ట్ లోని ఇతరులతో కలిసి ఏకంగా ఒక మిలియన్ డాలర్లు పెట్టుబడిగా అందించారు. ఇది ఏథర్ భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ తర్వాత మే 2015లో స్టార్టప్ టైగర్ గ్లోబల్ నుంచి 12 మిలియన్ డాలర్ల నిధులను సేకరించింది. ప్రస్తుతం కంపెనీ దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగులను కలిగి ఉంది. అలాగే అమ్మకాల పరంగా దేశంలోని టాప్-5 ఈవీ టూవీలర్ కంపెనీగా ఏథర్ నిలిచింది. అలాగే కంపెనీకి ప్రస్తుతం హీరో మోటార్స్ సైతం వెన్నుముకగా నిలిచింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+