Shiv Nadar Success: ఎవరైనా వ్యక్తి దేశంలో అందరూ గుర్తించదగిన వ్యాపారవేత్త స్థాయికి ఎదగటం అంత సులువైనది కాదు. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సమస్యలను దాటుకుంటూ శిఖరాన్ని చేరుకోవటానికి తప్పనిసరిగా అకుంటితమైన పట్టుదల చాలా ముఖ్యమని ప్రస్తుత సక్సెస్ స్టోరీ మనందరికీ తెలియజేస్తుంది.
ప్రస్తుతం భారతదేశంలో ప్రపంచ ఐటీ పవర్ హౌస్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే 1970ల చివరలో ఐబీఎమ్ వంటి విదేశీ టెక్ దిగ్గజాలు భారత మార్కెట్లో ఆధిపత్యం చెలాయించడం చూసిన ఒక చిన్న తమిళనాడు గ్రామానికి చెందిన ఒక యువకుడు దేశ సాంకేతిక ఎకోసిస్షమ్ పునర్నిర్మించే సాహసోపేతమైన మిషన్‌ను ప్రారంభించారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ అధినేత శివ్ నాడార్ గురించే. ఆయన దీనికి ముందు దిల్లీ క్లాత్ మిల్స్‌లో ఒక ఇంజనీర్. అయితే భారతదేశం తన స్వంత స్వదేశీ సాంకేతికతతో ప్రపంచ వేదికపై పోటీపడే భవిష్యత్తును అప్పట్లోనే నాడార్ ఊహించారు.

1976లో కొత్త స్థానిక వాటాదారుల నిబంధనల కారణంగా భారత్ నుంచి IBM నిష్క్రమించిన సమయంలో భారతీయ టెక్ కంపెనీకి బీజాలు నాటారు నాడార్. అలా 1976లో హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్(HCL)ని స్థాపించారు. అదే సమయంలో భారతీయ టెక్ ల్యాండ్‌స్కేప్ పరివర్తనకు సిద్ధంగా ఉంది. అతని సంకల్పం 1978లో భారతదేశం మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేయబడిన కంప్యూటర్, హెచ్‌సీఎల్ 8Cని సృష్టించడంతో అద్భుతమైన విజయంతో ప్రయాణం ముందుకు సాగింది. ఇక్కడితో ఆగిపోని నాడార్ గ్లోబల్ సామర్థ్యాన్ని గుర్తించి 1980లో సింగపూర్‌లో ఫాస్ట్ ఈస్ట్ కంప్యూటర్‌లను స్థాపించి అంతర్జాతీయ మార్కెట్‌లకు విస్తరించారు. వెంచర్ మంచి లాభాలను చూడటం HCLను అంతర్జాతీయ విజయానికి నాంది పలికేలా చేసింది.
1984లో UNIX-ఆధారిత వ్యక్తిగత కంప్యూటర్ అయిన BusyBeeని ప్రారంభించడంతో నిజమైన పురోగతి మెుదలైంది. ఇది ప్రారంభంలో అమెరికా మార్కెట్లలో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. 1991లో హ్యూలెట్ ప్యాకర్డ్(HP)తో హెచ్‌సీఎల్ వ్యూహాత్మక భాగస్వామ్యం కంపెనీని కొత్త శిఖరాలకు చేర్చింది. 2001 నాటికి హెచ్‌సీఎల్ భారతదేశపు అగ్ర డెస్క్‌టాప్ తయారీదారుగా అవతరించింది. ఈ క్రమంలో 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యంలో అనేక కంపెనీలు ఉద్యోగుల తొలగింపులకు వెళ్లినప్పటికీ నాడార్ తన ఉద్యోగుల పట్ల నిబద్ధత ప్రత్యేకంగా నిలిచారు. అలా అభివృద్ధి పరంపరను కొనసాగించిన కంపెనీ ఆదాయం రూ.12,565 కోట్లకు చేరుకుంది. 2010 నాటికి కంపెనీ లాభాలు రూ.2,072 కోట్లకు చేరుకున్నాయి.
ప్రస్తుతం దేశంలో మూడవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా కొనసాగుతున్న నాడార్ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మార్కెట్ క్యాప్ రూ.4.26 లక్షల కోట్లుగా ఉంది. టెక్స్‌టైల్ మిల్లు నుంచి టెక్ ఆధిపత్యానికి శివ్ నాడార్ చేసిన ప్రయాణం అతని దూరదృష్టితో కూడిన నాయకత్వానికి, కనికరంలేని డ్రైవ్‌కు నిదర్శనం. సుమారు రూ.30,000 కోట్ల నికర విలువతో నాడార్ కథ కేవలం వ్యక్తిగత విజయం గురించి మాత్రమే కాకుండా భారతదేశాన్ని ప్రపంచ ఐటీ పవర్‌హౌస్‌గా నిలపటంలో ఒక కీలకపాత్రను పోషించారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications