Success Story: రైల్వే స్టేషన్లలో నిద్ర.. వెయ్యితో స్టార్టైన రూ.36,000 కోట్ల కంపెనీ..
Success Story: రాత్రికి రాత్రి వ్యాపారవేత్తలుగా మారటం అస్సలు కుదరని పని. ఇప్పుడు స్టార్టప్ కంపెనీల మాదిరిగా గతంలో వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సహాయం చేసేందుకు ఎవ్వరూ లేరని గుర్తించాలి.
చిన్న పెట్టుబడితో ఎక్కువ మంది అడుగుపెట్టని బిజినెస్ ప్రారంభించి బిలియనీర్‌గా మారిన వ్యాపారవేత్త సత్యన్నారాయణ నువాల్(satyanarayan nuwal). 1995లో సోలార్ ఇండస్ట్రీస్ ఇండియాను ప్రారంభించిన ఆయన రాగ్-టు-రిచ్ కథ ప్రతి ఒక్కరికీ ఆదర్శం అని చెప్పుకోవాలి. రాజస్థాన్‌లోని భిల్వారాలో జన్మించిన నువాల్ తండ్రి ప్రభుత్వోద్యోగి. ఆయన పట్వారీగా 1971లో పదవీ విరమణ చేసిన తర్వాత కుటుంబం చాలా కష్టాలను ఎదుర్కొంది. అలా అతను 10వ తరగతి తర్వాత చదువు మానేశారు. ఇంటి కుటుంబ బాధ్యతల కారణంగా కాలేజీకి వెళ్లలేదు.
చిన్న తనంలోనే వ్యాపారం చేయాలనే మక్కువతో 18 ఏళ్ల వయస్సులో ఇంక్ తయారీ పరిశ్రమను స్థాపించాడు. కానీ కొంత కాలం తర్వాత అది విఫలమైంది. ధైర్యం కోల్పోని నువల్ తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లారు. కేవలం 19 ఏళ్ల వయస్సులో వివాహం జరిగింది. ఆ తర్వాత 1977లో నువాల్ మహారాష్ట్ర, చంద్రపూర్ జిల్లాలోని బల్హర్షాకు వచ్చారు. ఇది అతని జీవితాన్ని, తలరాతను మార్చేసింది.

విజయానికి తెరచుకున్న ద్వారాలు : బల్హర్షాలో నువల్.. అబ్దుల్ సత్తార్ అల్లాభాయ్‌ను కలిశారు. సత్తార్ బావులు త్రవ్వడం, రోడ్లు నిర్మించడం, గనులు తవ్వకం కోసం ఉపయోగించే పేలుడు పదార్థాల వ్యాపారి. కొన్ని నెలల తర్వాత నువాల్ అబ్దుల్ సత్తార్‌తో వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు మరియు అతను అబ్దుల్ సత్తార్‌కు నెలకు రూ.1,000 చెల్లించి వ్యాపారం ప్రారంభించాడు. మొదట్లో నువాల్ పేలుడు పదార్థాలను విక్రయించడానికి తన లైసెన్స్‌ను ఉపయోగించేందుకు సత్తార్‌కు డబ్బు చెల్లించేవాడు. అలా స్థాపించిన కంపెనీ ప్రస్తుతం రూ.36,000 కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యంగా అవతరించింది.
దశాబ్ధంలో తిరిగిన దశ : పేలుడు పదార్థాల వ్యాపారంలో ఉన్న నువల్‌ను.. బ్రిటీష్ సంస్థ ఇంపీరియల్ కెమికల్ ఇండస్ట్రీస్ అధికారులు గమనించారు. అది సరికొత్త అవకాశాల ప్రపంచానికి తలుపులు తెరిచింది. నువాల్ కంపెనీ ప్రస్తుతం మేక్ ఇన్ ఇండియా మిషన్‌లో భాగంగా పేలుడు పదార్థాలు, ప్రొపెల్లెంట్‌ల నుంచి గ్రెనేడ్‌లు, డ్రోన్‌లు, వార్‌హెడ్‌ల వరకు ప్రతిదీ తయారు చేస్తోంది. ఒక దశాబ్దంలో సోలార్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 1,700% పెరిగింది. 2012లో 1,765 కోట్లుగా ఉన్న మార్కెట్ నవంబర్ 2022 నాటికి రూ.35,000 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం సత్యన్నారాయణ నువాల్ నికర విలువ దాదాపు రూ.19,000 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications