Saket Dandotia: దేశంలోని యువత చిన్నదైనా సొంతంగా నచ్చిన పనిచేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో చిన్నగా ప్రయాణాన్ని ప్రారంభించిన ఒక విద్యార్థి కోట్ల విలువైన కంపెనీని నిర్మించాడు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన సాకేత్ దండోటియా సక్సెస్ స్టోరీ గురించే. ప్రస్తుతం అతని సంపద విలువ దాదాపు రూ.600 కోట్లుగా ఉంది. ఒక చిన్న పట్టణం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిన సాకేత్ అనేక సవాళ్లను ఎదుర్కొని జీవితంలో ఎదిగాడు. అంకితభావంతో పనిచేస్తూ విజయం సాధించిన సాకేత్ దండోతీయ సక్సెస్ స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కామిక్స్‌ను అద్దెకు ఇచ్చి డబ్బు సంపాదించడం నుంచి ఇండోర్ IT పార్క్‌లో తన స్వంత కంపెనీని స్థాపించడం వరకు సాకేత్ తన జీవితంలో పెద్ద ప్రయాణాన్ని చూశారు. 12వ తరగతిలో తక్కువ మార్కులు సాధించి ఐఐటీ జేఈఈకి రాకపోయినా పట్టు వదలలేదు. అతను MITS ఇండోర్ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగిగా ప్రయాణం మెుదలుపెట్టాడు. అయితే 2012లో ఉద్యోగ జీవితాన్ని విడిచిపెట్టి తన సొంత కంపెనీ లింకిట్స్‌ను ప్రారంభించాడు.
తొలుత కేవలం ఆరుగురు ఉద్యోగులతో ప్రారంభమైన కంపెనీ వేగంగా అభివృద్ధి చెందటం ప్రారంభించింది. అలా మూడేళ్లలోనే కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 150కి చేరుకుంది. ఇండోర్ ఐటీ పార్క్‌లో తన ఉనికిని నమోదు చేసుకున్న 5వ కంపెనీగా అవతరించింది. ఇక్కడ సాకేత్ 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేశాడు. కష్టాలు వచ్చినా, మొదట్లో తిరస్కరణలు వచ్చినా సాకేత్ పట్టు వదలలేదు. కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి.. సింగపూర్, అమెరికా, జపాన్, ఇండియాలో కార్యాలయాలను స్థాపించారు. ప్రస్తుతం కంపెనీ దాదాపు 800 మంది ఉద్యోగులను కలిగి ఉంది.
తనకు అడుగడుగునా అండగా నిలిచిన తన తల్లి భార్య నుంచి తిరుగులేని మద్దతు వల్లే విజయం సాధించగలిగినట్లు పేర్కొంది. 2016లో అతను మరో స్టార్టప్ వీడియోవర్స్‌ని ప్రారంభించాడు. దీని తర్వాత సాకేత్ తన కొత్త వెంచర్ OneTabని ప్రారంభించాడు. ఇండోర్ సాంకేతిక ప్రతిభను ప్రపంచ వేదికపైకి తీసుకురావడానికి సాకేత్ కట్టుబడి ఉంది.


Click it and Unblock the Notifications