RNR Donne Biryani: కొన్నిసార్లు అనుకోకుండా మెుదలుపెట్టిన జర్నీలే విజయ తీరాలకు చేర్చుతుంటాయి. కొందరు ఇంటివద్ద సదరగా మెుదలెట్టే వ్యాపారాలు వారిని తర్వాతి కాలంలో కోటీశ్వరులుగా మార్చేస్తుంటాయి. ఈ క్రమంలో కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఇద్దరు సిస్టర్స్ రమ్యా, స్వేత రవి ప్రారంభించిన వ్యాపారం వారికి ఊహించని సక్సెస్ అందించాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఆర్ఎన్ఆర్ దొన్నె బిర్యానీ సక్సెస్ స్టీరో గురించే. తొలుత రమ్య తన సోదరి శ్వేతతో కలిసి బెంగళూరులో కేవలం 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లౌడ్ కిచెన్‌ను నాగరభావిలో స్టార్ట్ చేశారు. 2020లో దీనిని వారు కేవలం రూ.5 లక్షల ప్రారంభ పెట్టుబడిదో ఒక చెఫ్, ఇద్దరు సహాయకులతో స్టార్ట్ చేశారు. తమ అమ్మమ గుర్తుగా వారు దొన్నె బిర్యానీని స్టార్ట్ చేయగా మెుదటి నెలలోనే 10,000 కంటే ఎక్కువ ఆర్టర్లు అందుకున్నారు. ఆ తర్వాత వారు వ్యాపారంలో వెనక్కి తిరిగి చూడలేదు. అయితే వ్యాపారం పెరిగే కొద్ది రుచి విషయంలో ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని వారు తీవ్రంగా కృషి చేశారు.

ఆర్ఎన్ఆర్ బిర్యానీలో వారు ప్రత్యేకంగా చిన్న గింజలు ఉండే జీరగ సాంబ బిర్యానీని వినియోగిస్తున్నారు. బిర్యానీ రుచి తమ అమ్మమ్మది కాగా.. RNR బిర్యానీ అనే పేరు తాత రామస్వామి, తండ్రి రవిచందర్ పేర్లను సూచిస్తుందని రమ్య వెల్లడించారు. పోటీ మార్కెట్లో తమకు ప్రత్యేక గుర్తింపును పొందేందుకు వీరు టేక్‌అవేస్‌గా అందించబడిన బిర్యానీలు, ప్రత్యేకమైన బ్లూ టిన్-బాక్స్ ప్యాకేజింగ్‌లో అందించటం ప్రారంభించారు. ఇది నాణ్యత పట్ల వారి నిబద్ధతతో పాటు బ్రాండ్ విజువల్ అప్పీల్‌కు దోహదపడింది.
దొన్నె బిర్యానీ రుచి బాగుండటంతో వీరు క్లౌడ్ కిచెన్ ప్రత్యేక బిర్యానీ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో మంచి ప్రచారాన్ని పొందింది. అలాగే ఆహారాన్ని తిన్న అనేక మంది బాగుందని ఇతరులకు చెప్పటంతో మౌత్ పబ్లిసిటీ కూడా భారీగా RNR డోన్ బిర్యానీని అనతికాలంలోనే ఫేమస్ చేసేసింది. దీంతో నిరాడంబరమైన క్లౌడ్ వంటగదిగా ప్రారంభమైనది త్వరలో పాకశాస్త్ర సంచలనంగా మారింది. అలా ప్రస్తుతం ఈ బ్రాండ్ విలువ దాదాపు రూ.10 కోట్లకు చేరుకుంది. ఈ ప్రయాణంలో ఎదురైన నిర్వహణ, సరఫరా వంటి అనేక సమస్యలను సోదరీమణులు విజయవంతంగా అధిగమించి తమ బ్రాండ్ ప్రజలకు చేరుకునేలా చేశారు.
ఈ క్రమంలో వారు బిర్యానీతో పాటు స్టార్టర్స్ వంటి ఇతర ఆహార ఎంపికలను సైతం అందించారు. వీరి ఇతర ప్రసిద్ధ వంటకాల్లోమటన్ బోన్ స్ట్రాంగ్ స్పైసీ సూప్, స్టార్టర్స్‌లో చికెన్ నెయ్యి రోస్ట్, డెజర్ట్ కేటగిరీలో కొబ్బరి పాయసం వంటివి కూడా ఉన్నాయి. అలాగే వీరి ఫుడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలకు అందుబాటులో ఉండటంతో యువత ఎక్కువగా ఇష్టపడటం ప్రారంభించారు. ఫుడ్ డెలివరీ పార్ట్‌నర్స్ తో జతకట్టిన తర్వాత నగరంలోనే వివిధ ప్రాంతాల్లో నివసించే తమ కస్టమర్లకు ఆర్డర్లు సర్వ్ చేయటం సులువుగా మారిందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం వీరికి బెంగళూరు వ్యాప్తంగా 14 క్లౌడ్ కిచెన్స్ ఉండగా, జయనగర్ 4వ బ్లాక్‌లో మొదటి డైన్-ఇన్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications